రేపు వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరు ప‌ర్య‌ట‌న‌

మాజీ మంత్రి  అంబటి కుటుంబాన్ని పరామర్శించ‌నున్న పార్టీ అధినేత‌

తాడేపల్లి : వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (04.02.2026) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల టీడీపీ రౌడీల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.

ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు బయలుదేరుతారు. మంగళగిరి, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ కార్యాలయం, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మార్గాల మీదుగా సిద్దార్ధనగర్‌లో ఉన్న అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ అంబటి కుటుంబ సభ్యులను కలిసి సంఘటనపై ఆరా తీసి వారికి ధైర్యం చెబుతారు.

పరామర్శ అనంతరం మధ్యాహ్నం గుజ్జనగుండ్ల, స్తంభాల గరువు, కలెక్టర్ కార్యాలయం, చుట్టుగుంట, కేవీపీ (వీఐపీ) రోడ్, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, కాకాని, మంగళగిరి మార్గాల మీదుగా తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Back to Top