రేపు ఏలూరులో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన

వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
 

పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10 వేల చొప్పున వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన కోసం ఏలూరులో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

Back to Top