రేపు ఇడుపుల‌పాయ‌కు సీఎం వైయ‌స్ జగన్   

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

వైయ‌స్ఆర్ జిల్లా:  దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి రేపు ఇడుపుల‌పాయ‌కు వెళ్ల‌నున్నారు. రేపు, ఎల్లుండి వైయ‌స్ఆర్ జిల్లా లో సీఎం ప‌ర్య‌టిస్తున్న‌ట్లు సీఎం అడిష‌న‌ల్ పీఎస్ కే.నాగేశ్వ‌ర‌రెడ్డి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, ఐఎస్ డబ్ల్యూ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  సీఎం వైయ‌స్‌ జగన్ ఈ నెల 7 మంగళవారం సాయంత్రం 4.55 గంటలకు ఇడుపులపాయ వస్తారు.  ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో వైయ‌స్ఆర్  విగ్రహావిష్కరణ, ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ తరగతి గదుల ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన ఉంటుంది. 

Back to Top