రేపటి నుంచి ‘నవశకం’ ప్రారంభం

విజయవాడ: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేసేందుకు ‘నవశకం’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి (నవంబర్‌ 20) ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని ఆయన వివరించారు. విజయవాడలోని 44, 51 డివిజన్లలో ఎమ్మెల్యే విష్ణు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారదర్శకతతో అర్హులందరికీ పథకాలు అందించేందుకు నవశకం కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందించడమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Read Also: బార్ల సంఖ్య 40 శాతం తగ్గింపు

తాజా ఫోటోలు

Back to Top