అవని లేఖరాకు సీఎం వైయ‌స్ జగన్‌ అభినందనలు

 అమరావతి: టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన షూటర్‌ అవని లేఖరాకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించి క్రీడా ప్రపంచంలో సరికొత్త రికార్డును సృష్టించారంటూ ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రాణిస్తూ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.

అదే విధంగా పారాలింపిక్స్‌లో సత్తా చాటుతున్న క్రీడాకారులందరికీ సీఎం వైయ‌స్ జగన్‌ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. టోక్యోలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారని కొనియాడారు. భారత్‌ ఖాతాలో ఇప్పటి వరకు 7 పతకాలు చేరాయని, మరిన్ని మెడల్స్‌ సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top