నేడు మ‌హానేత వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

ఇడుపులపాయలో వైయ‌స్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి
 

వైయ‌స్ఆర్ జిల్లా : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్ జిల్లాలోని ఇడుపుల‌పాయ‌లో నిర్వ‌హించ‌నున్నారు. మ‌హానేత‌కు నివాళుల‌ర్పించేందుకు  మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయకు చేరుకున్నారు. కడప విమానాశ్రయం, ఇడుపులపాయ హెలిప్యాడ్‌లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఇడుపులపాయ హెలిప్యాడ్‌ వద్ద సీఎం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలతో కలిసి నడుస్తూ అతిథి గృహానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 9.45 గంటలకు వైయ‌స్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం వైయ‌స్‌ జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. అలాగే రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు మ‌హానేత సేవ‌ల‌ను స్మ‌రించుకుంటున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top