అట్లాంటాలో ఘనంగా  వైయ‌స్ఆర్‌ జయంతి 

తాడేప‌ల్లి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని ఆదివారం అట్లాంటా దేశంలో వైయ‌స్ఆర్‌ అభిమానులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. హ‌రిపంగా, బాల‌సుధాక‌ర్‌రెడ్డి తుమ్మా  వైయ‌స్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో  కేక్‌ను కట్‌ చేశారు. తెలుగు జాతి ఈ నేల మీద నడయాడుతున్నంత కాలం.. జనానికి, జగతికి గుర్తుండి పోయే పేరు వైయ‌స్ఆర్‌ అని.. ఇప్పటికి ఆయన పేరు తలుచుకుంటే.. ఒక ఉద్వేగం.. ఓ పులకింత.. ఓ సంక్షేమ భావన గుర్తుకు వస్తాయని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. అనంతరం స్థానికుల‌కు స్లైస్ అండ్ స్పైస్ రెస్టారెంట్, బ్లాక్ బ్ల‌స్ట‌ర్ రెస్టారెంట్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  

Back to Top