లిక్కర్ స్కాం పేరుతో సజ్జల భార్గవపై చేసిన ఆరోపణలు అవాస్తవం

కట్టుకథలతో బురదచల్లేందుకు ఎల్లో మీడియా యత్నం

తీవ్రంగా మండిపడ్డ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి

నారా లోకేష్‌కు భీమ్ సంస్థ డైరెక్టర్ ప్రథ్యూమ్నా సన్నిహితుడు

గతంలో ప్రథ్యుమ్నా స్టూడియో-ఎన్‌ లో డైరెక్టర్‌గా పనిచేశాడు

ఆ చానెల్‌ను నారా లోకేష్ ప్రమోట్ చేశాడు

భీమ్ సంస్థకు కనీసం బ్యాంక్ ఖాతా కూడా లేదు

ఆ సంస్థ ద్వారా లిక్కర్ స్కాం డబ్బు ఎలా మళ్ళించగలరు?

సూటిగా ప్రశ్నించిన సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ప్రయోటర్లు చంద్రబాబు, లోకేష్‌లే

వైయస్ జగన్, విజయమ్మల మధ్య చిచ్చుపెట్టాలనే దుర్మార్గపు ఆలోచన

యూరియా కోసం రైతులు చేసే ఆందోళనలు కూడా ఫేకేనా?

కూటమి నేతలే యూరియా బ్లాక్‌ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు

ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: లేని లిక్కర్ స్కాంలో రోజుకో కట్టుకథను ప్రచారంలోకి తెచ్చి వైయస్ఆర్‌సీపీపై బురదచల్లడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని, వారికి తప్పుడు సమాచారాన్ని సిద్దం చేసి ఇవ్వడమే సిట్ తన దర్యాప్తుగా మార్చుకుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవపై ఈనాడు తన కథనంలో చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అసలు బ్యాంక్ ఖాతా కూడా లేని భీమ్ కంపెనీ ద్వారా లిక్కర్ స్కాం నిధులను మళ్ళించినట్లు అర్థంలేని కథనాలను ఎలా ప్రచురిస్తున్నారో చెప్పాలన్నారు. భీమ్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న ప్రథ్యుమ్నా మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని, గతంలో లోకేష్ ప్రమోట్ చేసిన స్టూడియో ఎన్‌లో ప్రథ్యుమ్నా డైరెక్టర్ గా చేసిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని చంద్రబాబు, లోకేష్‌లు నిర్వహిస్తూ, నిత్యం అబద్దాలను ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...

ఎల్లో మీడియా ఈనాడులో నా కుమారుడు సజ్జల భార్గవపై లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్నట్లుగా పచ్చి అబద్దాలతో కూడిన కథనాన్ని ప్రచురించారు. ఈ కథనంలో చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం. ఈ రోజు సిట్ అనే అధికారిక హోదా ఉన్న యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని దాని పేరు మీద ఎల్లో మీడియా తాము అనుకున్నవన్నీ కథనంలో రాశారు. సోషల్ మీడియాలో కూడా దీనిపైనే విషం చిమ్మే ప్రచారం ప్రారంభించారు.  

బ్యాంక్ ఖాతా కూడా లేని కంపెనీ సొమ్ము మళ్ళించగలదా?

గతంలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేందుకు భీమ్ అనే కంపెనీని ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల అసలు ఆ కంపెనీకి బ్యాంకు ఖాతానే తెరవలేదు. ఈనాడు కథనం ప్రకారం లేని లిక్కర్ స్కాం ద్వారా జరిగిందని చెబుతున్న దానిలో అవినీతి సొమ్మును ఈ కంపెనీ ద్వారా ఇతరులకు మళ్ళించారని రాశారు. అసలు బ్యాంక్ ఖాతానే లేని కంపెనీ ద్వారా సొమ్మును ఎలా మళ్ళించగలరో ఈనాడు ప్రతికే చెప్పాలి. ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో నిజంగా ఏదైనా అవినీతి జరిగితే అది ప్రముఖంగా ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్‌లోనే కనిపిస్తుంది. ఆర్డర్లు పొందిన డిస్లిలరీ కంపెనీ రికార్డుల్లో కనిపిస్తాయి. కానీ అలాంటిది ఏమీ లేదని ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వ పాలసీ ప్రకారం జరిగిన దానిని స్కాం అని చెప్పేందుకు ఎలాంటి ఆధారం చూపలేకపోతున్నారు. గత చంద్రబాబు పాలనలో ఫైబర్‌నెట్, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంల్లో చంద్రబాబు సంతకాలతో ఫైల్స్ ఉండటం, కేబినెట్‌లో నిర్ణయాలకు భిన్నంగా చేయడం, నేరుగా సొమ్ము బయటకు వెళ్ళడం, రికార్డులను మాయం చేయడం వంటి అక్రమాలను గుర్తించాం. వాటిపైన సిట్ దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసింది. ఈ దర్యాప్తులకు సంబందించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేస్తున్న మాదిరిగా అనుకూల మీడియాకు రోజుకో కట్టుకథను లీక్ చేసి, వార్తలు రాయించలేదు. వాస్తవంగా చంద్రబాబు అవినీతికి సంబంధం ఉన్న వారి పేర్లు, వారి సంస్థల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఇప్పటిలా పేపర్ల కోసం కథలు సృష్టించడం, బురదచల్లే వార్తలు రాయించడం జరగలేదు. ఎందుకంటే అప్పుడు జరిగింది నిజమైన స్కాం కాబట్టి. ఈ రోజు చంద్రబాబుకు స్కాం అనేది కనిపించకపోయినా, ఏదో అవినీతి జరిగిపోయినట్లు ఎలా చిత్రీకరించాలి, ప్రజల్లోకి ఎలా ప్రచారంలోకి తీసుకు పోవాలనే దానిలో భాగంగానే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కట్టుకథలను లీక్ చేసి, సంబంధం లేని వారి పేర్లను ఇరికించి, తప్పుడు కథనాలు రాసి, అవే నిజాలన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. వారికి సంబంధించిన టీవీ చానెల్స్‌లో డిబేట్లు పెట్టి, మరింత విస్తృతంగ ప్రచారం చేస్తున్నారు. 

సజ్జల భార్గవపై బురదచల్లే కుట్ర 

కూటమి ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో విచారణ పేరుతో యాక్టివిటీ లేని భీమ్ కంపెనీని తీసుకువచ్చి, సజ్జల భార్గవకి దీనితో సంబంధం ఉందంటూ, ఇక్కడి నుంచే డబ్బు మళ్లించారంటూ కట్టుకథలను వండివారుస్తున్నారు. ఆ కంపెనీకి ప్రథ్యుమ్నా అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు చెక్‌పోస్ట్ వద్ద పట్టుబడిన డబ్బు తన కంపెనీకి చెందినదేనని ఆయన క్లైయిమ్ చేసుకున్నరాఉ. అప్పుడు లిక్కర్ స్కాం అంటూ కేసు వస్తుందని కూడా ఎవరికీ తెలియదు. అతడిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చుట్టూ ఒక కథ అల్లి, దానిలో భీమ్ డైరెక్టర్  ప్రథ్యుమ్నాను కూడా కలిపి ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెడుతున్నారు. ప్రథ్యుమ్నా అనే వ్యక్తి గతంలో స్టూడియో-ఎన్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ చానెల్‌ను నారా లోకేష్ ప్రమోట్ చేశాడు. నార్నె శ్రీనివాసరావు ఎండీగా, ప్రథ్యుమ్నా డైరెక్టర్‌లుగా ఈ ఛానెల్‌ను ప్రారంభించారు. నారా లోకేష్‌తో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నారా లోకేష్‌తో స్టూడియో-ఎన్ కు ఉన్న అనుబంధానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ సందర్బంగా ఈ మీడియా సమావేశంలో చూపిస్తున్నాం. దీనిపై అప్పట్లో వచ్చిన కథనాలు, వీక్ మ్యాగజైన్‌లో వచ్చిన కథనం, నారా లోకేష్ ఈ చానెల్‌ విషయంలో యాక్టీవ్‌గా ఉన్నారని, జూనియర్ ఎన్టీఆర్ నార్నె శ్రీనివాసరావు కుమార్తెను వివాహం చేసుకున్న తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఈ చానెల్‌ను టేకోవర్ చేస్తారని, దీనికి లోకేష్ ఇష్టపడటం లేదనే కథనాలు కూడా వచ్చాయి. వాటికి సంబంధించిన అన్ని క్లిపింగ్స్‌ను మీడియాకు చూపుతున్నాము.  

సీఎంగా చంద్రబాబు ఫేక్ మాటలు

రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని పక్కకుపెట్టి ఎల్లో మీడియాలో రాజకీయ ప్రేరేపిత అసత్య కథనాలను రాయిస్తూ, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.  రైతులకు సంబంధించి ఫేక్ ఆందోళనలు అంటూ చంద్రబాబు మాట్లాడారు. ఆయన ఏంమాట్లాడారో ఆ వీడియోను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. యూరియాపై రైతులు చేస్తున్నదంతా ఫేక్ అంటూ చంద్రబాబు ఖండించారు. దీనిపై వైయస్ జగన్ గారు ఎక్స్‌ వేదికగా స్పందిస్తే, రైతులు ఆదోళనలు చేస్తుంటే, దానిపైన ఫేక్అంటూ చంద్రబాబు మాట్లాడారు. నిన్న ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేశారు. దానిపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఎక్స్ వేదిక ద్వారా ప్రశ్నిస్తే, దానిని ఫేక్ అంటూ చంద్రబాబు ఖండించడం ఆశ్చర్యంగా ఉంది. అంటే తాను ఏ అబద్దం చెప్పినా, దానిని నిజమని ప్రజలను నమ్మించగలననే నమ్మకంతో ఉన్నారు. నిజాలను ఫేక్ అంటూ దబాయించడం, తమాషాలు చేస్తున్నారా? అంతుచూస్తాను అని బెదరించడం చేస్తున్నారు. నిజాలను బైటికి తెచ్చేవారిపై చర్యలు తీసుకుంటామని, దానికోసం చట్టాలు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదే చంద్రబాబు లంకపల్లికి వెళ్ళి ఆందోళన చేసిన రైతులతో ఇది ఫేక్ అని చెప్పిస్తారా? యూరియా కోసం రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆందోళనలకు సంబంధించిన ఫోటోలు, మీడియాలో వచ్చిన కథనాలను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రైతులు ఊరియా కోసం క్యూ కట్టిన దృశ్యాలను కూడా ప్రదర్శిస్తున్నాం. దీనిని కూడా చంద్రబాబు ఫేక్ అని చెప్పగలడా? ఇవి నిజమైన సమస్యలు కావడం వల్లే రైతుల సమస్యలపై ఈనెల 9న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ, అధికారులకు రిప్రజెంటేషన్స్‌ ఇస్తున్నాం. 

యూరియాపై ఆందోళన చేసిన రైతులకు రాజకీయం అంటగట్టారు

కృష్ణాజిల్లా పామర్రు మండలం చినముత్తేవి రోడ్డుపై రైతులు బైటాయించి ఆందోళనలు నిర్వహించారు. యూరియాతో కూడిన లారీ అక్రమంగా తరలివెడుతోందని తెలిసి రైతులు దానిని అడ్డుకున్నారు. డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ ఆందోళనలో అన్ని పార్టీల వారు ఉన్నారు. దానికి సంబంధించి మే ప్రదర్శిస్తున్న ఫోటోల్లో టీడీపీ, జనసేన,వైయస్ఆర్‌సీపీకి చెందిన రైతులు కూడా ఉన్నారు. పోలీసులు లారీని సీజ్ చేశారు, రైతులకు పోలీసులు నచ్చచెప్పి పంపారు. విజిలెన్స్‌ వారు చేయాల్సిన పని, రైతులు చేశారు. దానిని అభినందించాల్సింది పోయి, దానిని సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు వక్రీకరిస్తూ మాట్లాడారు. ఈ ఘటనలో పేర్లు పెట్టి వైయస్ఆర్‌సీపీ వారే ఎరువుల లారీని అడ్డుకున్నారంటూ బెదిరింపులకు దిగారు. ఇదే ఫోటోల్లో జనసేన, టీడీపీ వారు కూడా ఉన్నారు. ఆ విషయం చంద్రబాబుకు తెలియదా? యూరియా కొరత లేదని ఒకవైపు చంద్రబాబు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కేవలం అరవై శాతం మాత్రమే సాగు జరుగుతూ ఉంటే, యూరియా కొరత ఎలా ఏర్పడింది? అంటే కృత్రిమ కొరతను సృష్టించి, నల్లబజార్‌లో అధిక రేట్లకు అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. కడుపు మండి ప్రశ్నించిన రైతులపై వైయస్ఆర్‌సీపీ ముద్ర వేసి, వారిపై చర్యలు తీసుకుంటానని చంద్రబాబు బెదిరిస్తున్నాడు. 

ఫేక్ న్యూస్‌ ఫ్యాక్టరీని నడుపుతున్న చంద్రబాబు, లోకేష్

చంద్రబాబు, లోకేష్‌లు ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్నారు. వారంలో రెండుమూడు రోజులు వారు రాష్ట్రంలోనే ఉండరు. రాష్ట్రంలో గెస్ట్ లెక్చరర్‌లుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్‌లు పనిచేస్తున్నారు. నిజాలు మాట్లాడితే ఫేక్ అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. మంత్రి లోకేష్ వ్యక్తిగత అంశాలపై తప్ప రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఏ రోజు మాట్లాడడు. ప్రపంచంలో ఏ ఆవిష్కరణ జరిగినా అమరావతిలోనే అది జరిగిపోయినట్లు మాట్లాడుతుంటాడు. ఈనెల రెండో తేదీన ఇడుపులపాయలో వైయస్ఆర్‌ సమాది వద్ద వైయస్ జగన్, తల్లి విజయమ్మలు నివాళులు అర్పించారు. అక్కడ తల్లి, కుమారుడు కలుసుకున్నారు. దానిపైనా లోకేష్ ఎలా విమర్శ చేయాలనే ఆలోచనలు చేయడం దరిద్రం కాదా? ఆరోజు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్నాం. ఈ వీడియో చూసిన వారికి ఎవరికైనా తల్లి, కుమారుడి మధ్య కూడా చిచ్చు పెట్టవచ్చనే ఆలోచన వస్తుందా? ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు కేవలం లోకేష్‌కే వస్తుంటాయి. హైదరాబాద్‌లో ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని పెట్టి, జగన్ గారు ఎక్కడిక వెళ్లినా ఆ దృశ్యాలన ఫ్రేంలుగా చూస్తూ, దానిలో ఏదైనా వక్రీకరణలు చేయవచ్చా అని చూస్తున్నారు. ఏమీ లేకపోయినా ఏదో ఒకటి సృష్టించి శునకానందం పొందుతున్నారు. విజయమ్మ, వైయస్ జగన్‌గారు కొట్లాడుకోవాలి, వారు పలకరించకోకూడదు అనే కోరికతో లోకేష్ ఉన్నాడా? అలా జరగకపోతే తట్టుకోలేక ఏదో ఒకటి క్రియేట్ చేసి, దానిని ప్రచారంలోకి తెస్తున్నారు. చంద్రబాబు చేస్తున్నాదే నిజమైన ఫేక్. ఎనాడైనా చంద్రబాబు తన చెల్లెళ్లు, తన సోదరుడి గురించి పట్టించుకున్నాడా? తన ఆస్థిలో వారికి వాటా ఇచ్చాడా? 

రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం

రాష్ట్రంలోని పబ్లిక్ సమస్యలపై దృష్టి లేదు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ గురించి మాట్లాడరు. ప్రైవేటీకరణ జరుగుతుంటే పట్టించుకోరు. రాబోయే మూడేళ్ళు నాకేం కాదు, ఏం చేసినా చెల్లుతుంది, ఎవరూ ప్రశ్నించడానికి వీలులేదనే రీతిలో బెదిరించడం సరికాదు. పాలన లేదు, అడ్డగోలుగా కమీషన్ల రాజ్యం, మాఫియా పాలన సాగుతోంది. ప్రతిదానిలో డబ్బు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కిందిస్తాయి నుంచి పై స్థాయి వరకు ఈ దోపిడీ జరుగుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో అరాచకం సృష్టిస్తున్నారు. దీని ఎఫెక్ట్‌ ఏమిటో రాబోయే రోజుల్లో ప్రజాతీర్పు ద్వారా వారికి అర్థమవుతుంది. చంద్రబాబు, లోకేష్‌ల అండ చూసుకుని అక్రమాలకు పాల్పడిన అధికారులు, నాయకలు, కార్యకర్తలకు ఈస్ట్‌మన్ కలర్‌లో పిక్చర్ కనిపిస్తుంది. చంద్రబాబు తనను తాను కాపాడుకునేందుకే ఢిల్లీకి వెడుతున్నారు. తండ్రీ, కొడుకు ఢిల్లీకి పైరవీల కోసమే వెళుతున్నారు.

Back to Top