నేడు అంబేద్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌ ప‌రిశీలన‌

విజ‌య‌వాడ‌: ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ, (అంబేద్కర్ విగ్రహం దగ్గర ) కార్యక్రమ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు,వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  వి.విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం  పార్టీ ముఖ్య నాయకులు, అధికారులతో పరిశీలించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గం.లకు విజ‌య‌వాడ స్వరాజ్ మైదానాన్ని సంద‌ర్శించి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు.

ఈ నెల 19న నిర్వహించే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం ప్రారంభోత్సవ ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. 125 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా జరగనున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను  విజ‌య‌సాయిరెడ్డి స‌మీక్షించ‌నున్నారు. ఈ కార్యక్రమానికి ఏలూరు, పల్నాడు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 80 వేల మందికి పైగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. వారి కోసం ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. బారికేడ్లతోపాటు కూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.  

తాజా వీడియోలు

Back to Top