నేడు సీఎం వైయ‌స్ జ‌గన్ విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌

విజ‌య‌వాడ‌:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) విజయవాడకు రానున్నారు. నగరంలోని రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించనున్నారాయన. ఈ సందర్భంలో.. అక్కడున్న అనాథ పిల్లలతో సీఎం జగన్‌ ముచ్చటిస్తారు. ఆ కార్యక్రమం తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి వస్తారు.

మరోవైపు ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సేవా కార్యక్రమాలను  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్‌ కట్‌ చేసి ప్రారంభిస్తారు.

Back to Top