సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం చేయూత

నేడు పరిశ్రమలకు ప్రోత్సాహకం అందించనున్న సీఎం వైయస్‌ జగన్‌

 తాడేపల్లి: లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి రీస్టార్ట్‌ ప్యాకేజీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం అందించనున్నారు.సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం చేయూత ఇస్తోంది. పరిశ్రమలకు ప్రోత్సాహకం   సీఎం వైయస్‌ జగన్‌ అందించనున్నారు. క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులతో సీఎం మాట్లాడనున్నారు. 

రూ.905 కోట్ల ప్రోత్సాహకం
గత ప్రభుత్వ బకాయిలు రూ.827 కోట్లతో పాటు మొత్తంగా రూ.905 కోట్ల ప్రోత్సాహకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అందించనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండు విడతలుగా ప్రోత్సాహకం  పంపిణీ చేయనున్నారు. మొదటి విడతగా రూ.450 కోట్లు ఇవాళ విడుదల చేస్తారు.   కరోనా కష్టకాలంలో  చిన్న పరిశ్రమలు కుదేలయ్యాయి. 98 వేల పరిశ్రమల్లో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులను ఉన్నారు.   ఇలాంటి సమయంలో ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలిచింది.

Back to Top