తిరుమల: భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేలా సర్వదర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తామని, నడకదారి భక్తులకు దివ్యదర్శనం టికెట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల స్థలం కేటాయించిందని, త్వరలోనే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ఆలయ నిర్మాణానికి ముందుకువచ్చిన గౌతమ్ సింఘానియాకు, స్థలం కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మే 5న సీఎం వైయస్ జగన్ తిరుమలలో పర్యటిస్తారని, చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి శంకుస్థాపన, టాటా క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సీఎం చేతుల మీదుగా జరుగనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలు.. - శ్రీవారి మెట్టు మార్గం మే 5 నుంచి ప్రారంభం. - శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం. పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల నిర్మాణానికి 21 కోట్లు కేటాయింపు. మరో ఏడాదిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి. - విపత్తుల సమయంలో ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురికాకుండా కమిటి సూచనలు. అనేక ప్రాంతాలలో ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. - రెండు విడతలుగా మరమ్మతులు.. 36 కోట్లు ఘాట్ రోడ్డు మరమ్మతులు. - తిరుమలలో బాలాజీ నగర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు. - బయో గ్యాస్ ద్వారా అన్నప్రసాద కేంద్రం, లడ్డూ తయారీకి ఉపయోగించాలని నిర్ణయం. - తిరుమల లోని టీటీడీ ఉద్యోగులు ఉండే 737 కాటేజీలు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయం. - ధన రూపంలో ఇచ్చే విరాళాలు టీటీడీ అన్ని ప్రివిలేజ్ ఇస్తుంది. ఇకపై వస్తు రూపంలో ఇచ్చే వాటికి కూడా ప్రివిలేజ్ ఇవ్వాలని నిర్ణయం. - టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాలపై నిర్ణయం. - శ్రీనివాససేతు ప్రారంభం. - బర్డ్ ఆస్పత్రిలో స్మైల్వట్రైన్ కేంద్రం ఏర్పాటు. - తిరుమలలో స్థానికుల సమస్యలు పరిష్కారానికి పాలకమండలి నిర్ణయం.