నెటిజన్లకు సీఎం వైయ‌స్ జగన్‌ కృతజ్ఞతలు

 అమరావతి : సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ  వైయ‌స్ఆర్‌సీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. 'నేను రాష్ట్ర బాధ్యతలను స్వీకరించటానికి సహకరించిన సోషల్‌ మీడియా యోధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం మీరు ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఎల్లో మీడియా తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ  వైయ‌స్ఆర్‌సీపీ  విజయంలో కీలక పాత్ర పోషించారు. మీ సహకారాన్ని ఎప్పుడూ ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నా' అని ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య 1మిలియన్‌ దాటింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top