అవంతి శ్రీనివాస్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ఎంపీ

టీడీపీతో పాటు ఎంపీ పదవికి అవంతి రాజీనామా

రాజీనామా చేశాకే వైయస్‌ జగన్‌ను కలిశా 

కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబే

అవినీతి బాగోతం వెలుగు చూడటంతో మోదీతో బాబుకు విభేదాలు

ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో వైయస్‌ జగన్‌ ఉన్నారు

వైయస్‌ జగన్‌తోనే అన్ని వర్గాలకు మేలు

హైదరాబాద్‌: చంద్రబాబు తీరుతో విసికిపోయిన టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీ వీడుతున్నారు. కొద్దిసేపటి క్రితం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి వైయస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు అనుభవం ఉందని ముఖ్యమంత్రిని చేస్తే..ఆయన రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. వైయస్‌ జగన్‌ ఒక తపన ఉన్న వ్యక్తి అని, ఆయనపాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారని, మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

వైయస్‌ జగన్‌ పింఛన్‌ రూ.2 వేలు పెంచుతానని ప్రకటించగానే చంద్రబాబు పెంచారని తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబే అన్నారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసే సమయంలో రైలు తగులబడితే కడప నుంచి గుండాలు వచ్చారని చంద్రబాబు అబంఢాలు వేశారన్నారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఒక్క పోలీసు అధికారిని కూడా నియమించలేదన్నారు. జగన్‌ ప్రశ్నిస్తే అవినీతిపరుడు అంటున్నారని, ఆయన్ను ఎవరు ప్రశ్నించినా సహించలేరన్నారు. టీడీపీలో ఉన్న చాలా మంది కూడా చంద్రబాబుపై మంచి ఉద్దేశం లేదన్నారు. అనుభవం ఉందని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన రాష్ట్రాన్ని బాగు చేయలేదని, ఆయన కుమారుడు, చంద్రబాబు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు.దుర్మార్గమైన పరిపాలన సాగుతుందని, ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలు చాలా చైతన్యవంతులయ్యారని, 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. నీతిగా, నిజాయితీగా ఉన్న వారికి విలువ లేదని,    వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నానని, రాబోయే రోజుల్లో అవినీతి పాలనకు చరమ గీతం పాడి మంచి పాలన తెచ్చుకుందామని కోరారు.

మహానేత పాలన మళ్లీ రావాలంటే వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుందని మండిపడ్డారు. రాజకీయాల్లో ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి శత్రువును సైతం క్షమించారని తెలిపారు. 2014లో ఐదుగురు మంది టీడీపీలో చేరామన్నారు. ఇవాళ చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడలేదన్నారు. అందుకే టీడీపీ వీడి వైయస్‌ఆర్‌సీపీలో చేరానని, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ తానే అని..ఇంకా చాలా మంది వస్తారని చెప్పారు. ప్రజలు  ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. చంద్రబాబును మూడుసార్లు చూశామని..ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఈసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇద్దామని, ఆయనతోనే రాష్ట్రం బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారని, అయితే వారితో రాజీనామా చేయించలేదన్నారు.

వైయస్‌ జగన్‌ విలువలు ఉన్న వ్యక్తి అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తరువాతే తనను వైయస్‌ఆర్‌సీపీలోకి చేర్చుకున్నారన్నారు. రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, వైయస్‌ జగన్‌రాష్ట్రం కోసం పని చేస్తున్నారని, ఆయనతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.  చంద్రబాబు ఏం చెపపే అది వినడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీతో చంద్రబాబు విభేదించలేదని స్పష్టం చేశారు. ఓ టీడీపీ ఎమ్మెల్యే అవినీతి గురించి ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లిందని తెలిపారు. ఆ ఎమ్మెల్యే అవినీతిపై పీఎంవో విచారణ జరిపిందన్నారు. అవినీతి బాగోతం వెలుగు చూడటంతో మోదీతో బాబుకు విభేదాలు వచ్చాయన్నారు. పార్లమెంట్‌సమావేశాలు ముగిసినా ఎం సాధించలేకపోయామన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసిన సమయంలోనే అందరం రాజీనామా చేసి ఉంటే ప్రయోజనం ఉండేదన్నారు. ఎంత చెప్పినా చంద్రబాబు మా మాటలు వినలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. అందుకే వైయస్‌ జగన్‌ వెంట నడవాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. 
 

Back to Top