పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి ఫ్లెక్సీలు

  ఫిర్యాదు చేసినా తొలగించని అధికారులు.. ఎన్నికల నియమావళి అమలుపై ప్రశ్నలు

అనంతపురం: అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన చోటుచేసుకుందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వేణుగోపాల్‌ నగర్‌లోని విద్యారణ్య ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఉండటంపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాటిని తొలగించలేదని పేర్కొన్నారు.

పోలింగ్‌ కేంద్రం వద్ద ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఫ్లెక్సీలు కొనసాగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన అధికారులు ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో ఉన్న రాజకీయ ప్రచార సామగ్రిని తొలగించి నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు.

Back to Top