రెచ్చిపోయిన‌ టీడీపీ, జనసేన గూండాలు

తిరుప‌తిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేట‌ర్ల‌పై దాడి

తిరుపతి: మున్సిపల్‌ ఎన్నికల వేళ తిరుపతిలో టీడీపీ, జ‌న‌సేన గూండాలు రెచ్చిపోయారు.వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన మూక‌లు దాడికి పాల్ప‌డ్డాయి.  ఎన్నికల సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై అధికార పార్టీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. అనంతరం, కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. 

పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ
మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా తిరుపతిలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేశారు. ​కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై జనసేన, టీడీపీ కార్యకర్తల రాళ్ల రువ్వడంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో సాక్షి రిపోర్టర్‌, కెమెరామెన్‌పై పచ్చ గూండాలు దాడికి దిగారు. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ పచ్చ మూకలు రెచ్చిపోవడం గమనార్హం. 

దాడి చేసిన వ్యక్తి టీడీపీకి చెందిన శంకర్‌ యాదవ్‌గా గుర్తింపు
బస్సుపై దాడి చేసిన వ్యక్తిని టీడీపీకి చెందిన శంకర్‌ యాదవ్‌గా గుర్తించారు. శంకర్‌ యాదవ్‌ ఓవరాక్షన్‌ చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా వ్యవహరించారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు.  ఈ దాడిని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్ తీవ్రంగా ఖండించారు. కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ప్రశ్నించారు. 

Back to Top