భీమవరం : శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేన్‌రాజు కుమారుడి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. భీమవరం సమీపంలోని పెదఅమిరం గ్రామంలో ఉన్న శ్రీ రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకలో శ్రీ వైయస్ జగన్ పాల్గొని నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్)లకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు శ్రీ వైయస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొని నూతన దంపతులను అభినందించారు.