డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికు వైయ‌స్ జ‌గ‌న్‌ జన్మదిన శుభాకాంక్షలు

తాడేప‌ల్లి: ప్రఖ్యాత వైద్యవేత్త, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ వైద్యుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను అందించే వైద్య రంగ పయనీరుగా ఎదగడం ఆదర్శప్రాయమని కొనియాడారు. దేశంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరించడంలో డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారు చేసిన సేవలు విశేషమైనవని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో నూతన మార్గాలను సృష్టిస్తూ లక్షలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేర‌కు వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Image

Back to Top