వైయ‌స్‌ జగన్‌ పర్యటన రూట్ మ్యాప్‌లో స్వల్ప మార్పులు

నేడు ఇబ్రహింపట్నంలో జోగి రమేష్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహింపట్నంలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్‌పై ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈ పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైయస్‌ జగన్‌ ఇబ్రహింపట్నానికి బయలుదేరుతారు. మంగళగిరి బైపాస్‌, కాజా వెస్ట్ బైపాస్‌, నల్లగుంట, గుంటుపల్లి మార్గంగా ఇబ్రహింపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసానికి చేరుకుంటారు. 

ఇటీవల టీడీపీ రౌడీల చేతిలో దాడికి గురైన జోగి రమేష్‌ నివాసంలో కుటుంబ సభ్యులను వైయస్‌ జగన్‌ పరామర్శించి, సంఘీభావం తెలియజేస్తారు. బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పనున్నారు.

పరామర్శ అనంతరం మధ్యాహ్నం వైయస్‌ జగన్‌ తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Back to Top