జోగి రమేష్‌ ఇంటికి బయల్దేరిన వైయ‌స్‌ జగన్ 

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోగి రమేష్‌ ఇంటికి బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాజా, వెస్ట్‌ బైపాస్‌, గొల్లపూడి మార్గంగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. 
ఇటీవల ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటి వద్ద టీడీపీ గూండాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెట్రోల్‌ బాంబులతో ఇంటిపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో జోగి రమేష్‌, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ స్వయంగా ఇబ్రహీంపట్నం వెళ్లుతున్నారు. దాడి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని బాధిత కుటుంబానికి సంఘీభావం తెలియజేయనున్నారు. వైయ‌స్ జగన్‌ పర్యటన నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇబ్రహీంపట్నానికి తరలివెళ్తుండగా, ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
 

Back to Top