తోకలు కత్తిరిస్తాను అన్నందుకే బాబు పిలక కత్తిరించారు

 స్పీకర్‌ తమ్మినేని సీతారాం
 

విజ‌య‌వాడ‌: తోకలు కత్తిరిస్తాను అన్నందుకే చంద్రబాబు పిలక కత్తిరించి, గుండుకు సున్నం రాశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అన్నారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన వైయ‌స్ఆర్‌సీపీ జ‌య‌హో బీసీ స‌భ‌లో స్పీక‌ర్ మాట్లాడారు.  చరిత్ర తెలియని వాళ్ళు మా తోకలు కత్తిరిస్తారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ్రీకృష్ణుడు యాదవ బీసీ, వాల్మీకి బోయ బీసీ, రాముడు గుహుడు జాలరి బీసీ, భీష్ముడు గంగా పుత్రుడు, చరిత్ర తెలియని వాళ్ళు మా తోకలు కత్తిరిస్తారా? అంటూ ఫైర్‌ అయ్యారు.. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారా? అని నిలదీసిన ఆయన.. బీసీల దెబ్బ ఏంటో చంద్రబాబుకు తెలుసు.. తోకలు కత్తిరిస్తాను అన్నందుకే చంద్రబాబు పిలక కత్తిరించి, గుండుకు సున్నం రాశారు.. అచ్చెన్నాయుడు నీ నాలుక తెగుతుంది.. నీ నాలుక చీలిక అవుతుంది.. వచ్చే ఎన్నికల్లో బీసీలు చరిత్ర తిరిగి రాయనున్నారన్నారు.. 
సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు గొప్ప ఆత్మగౌరవం ఇచ్చారు. బీసీలకు సమున్నత స్థానం కల్పించారు. బీసీలకు పదవులిచ్చి ప్రొత్సహించింది సీఎం వైయ‌స్ జగన్‌. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు కల్పించారు. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారు. బీసీలంతా ఆలోచించుకుని.. సీఎం వైయ‌స్‌ జగన్‌ వెంట నడవాలని తమ్మినేని సీతారాం బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు స్పీకర్‌ తమ్మినేని. ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం ముసుగులు వేసుకుని మారువేషంలో వస్తున్నారు జాగ్రత్త.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బీసీలు బుద్ధి చెప్పాలి అని తమ్మినేని పిలుపు ఇచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top