సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

125 అడుగుల అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి శంకుస్థాప‌న చేయ‌డంపై హ‌ర్షం

విజ‌య‌వాడ‌: 125 అడుగుల అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటుకు శంకుస్థాప‌న చేయ‌డంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద‌ళిత నేత‌లు క‌న‌క‌రావు మాదిగ‌, మ‌ధుసూద‌న్‌రావు అమ్మాజీ, ప‌ద్మ‌జ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి ద‌ళిత నేత‌ల పాలాభిషేకం చేశారు. విజ‌య‌వాడ న‌డిబొడ్డున  అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. చంద్ర‌బాబు ఊరు చివ‌ర అంబేడ్క‌ర్ విగ్ర‌హం పెడ‌తాన‌ని ద‌ళితుల‌ను మోసం చేశార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ద‌ళిత వ్య‌తిరేకి అని.. కోర్టుల్లో కేసులు వేయించి అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటుకు అడ్డుకోవాల‌ని చూస్తున్నారని మండిప‌డ్డారు.

Back to Top