క‌ర్నూలులో ఘ‌నంగా సావిత్రిబాయి పూలే జయంతి  

కర్నూలు: మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని బిర్లా కూడలి వద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి, వారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొని సావిత్రిబాయి పూలే చేసిన సామాజిక సేవలను కొనియాడారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ మార్గదర్శకమని ఆయన అన్నారు.

అలాగే రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మహిళల హక్కులు, విద్య కోసం చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం ఆమె చూపిన దారిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా విభాగం కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు.

Back to Top