చంద్రబాబు శాపనార్థాలతో ఏం ప్రయోజనం? 

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి

ఆధారాలు లేకుండా సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై చంద్రబాబు విమర్శలు

చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

వైయస్‌ జగన్‌పై నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీ అందించారు

రెండున్నర ఏళ్లుగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో ఒకే ఫలితం

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి

తాడేపల్లి: ప్రతిపక్ష చంద్రబాబు శాపనార్థాలతో ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతుందని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం వైయస్‌ జగన్‌పై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దృష్ట సంప్రదాయాలకు తెర లేపిందే చంద్రబాబు అన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు టీడీపీ ఘోరంగా ఓడిపోతే ఎక్కడ లోపం ఉందో సమీక్ష చేయకుండా ఇతరులను నిందించడం శోచనీయమన్నారు.  కుప్పంలో టీడీపీ పార్టీ ఘోర ఓటమి చవిచూసిందని, అక్కడ టీడీపీ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

చంద్రబాబు తన పాలన, ఇప్పుడి పాలన, ఎప్పటిలాగే హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, సెల్‌ఫోన్‌ కనిపెట్టానని నిన్న ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఓ వర్గం మీడియా ఆయన మాటలను విస్తృతంగా ప్రచారం చేసింది. చంద్రబాబు ఏ తప్పులు చేశాడో..ఏ తప్పులు చూసినతరువాత 2019లో జనం ఆయన్ను సాగనంపారో అవన్నీ కూడా కళ్లు మూసుకొని, వైయస్‌ జగన్‌ పాలనపై, వ్యక్తిగతంగా నిందలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  చంద్రబాబు హయాంలో ఎన్ని కథలు చెప్పినా ప్రజలు రిజెక్ట్‌ చేశారు. ఆయన చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మలేదు. 

మా పార్టీ 2014లో తప్పటడుగులు వేస్తున్న చిన్న పార్టీ, 2019లో ఒక ఆర్గనైజేషన్‌గా ప్రజల్లోకి వచ్చింది. వైయస్‌ జగన్‌పై నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీ అందించారు. మా పార్టీకి ప్రజలు భారీ విజయాన్ని అందించారు. అంత గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు పార్టీకి భారీ తీర్పు ఇచ్చారు. మనలో ఏం లోపముందని చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకొని మార్పులు చేసుకుంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ చంద్రబాబు అదే తప్పులు చేస్తున్నారు. 2019 తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి అదే తీర్పు వస్తున్నా కూడా బుద్ధి మారడం లేదు. పూర్వం తెలుగు సినిమాల్లో ఇలాంటివి కనిపించేవి. ఎక్కడ చిన్నపాటి అవకాశం దొరికినా చంద్రబాబు శాపనార్థాలు పెడుతున్నాడు. చిల్లరగా చెట్టు కింద కూర్చొని మాట్లాడే వారి మాదిరిగా పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు రెండు గంటల ప్రసంగమంతా కూడా అలాగే ఉంది. ఇలాంటి శాపాలు పెట్టడం సీనియర్‌ నాయకుడిగా చంద్రబాబుకు ఏం ప్రయోజనం దక్కుతుందో ..వారి కార్యకర్తలకు కూడా ఆయన ప్రసంగాలు ఊపు ఇవ్వడం లేదు. కుప్పంలో ఓటమితోనే అందరూ ఢీలా పడ్డారు. అలాంటిది ఢీ అంటే ఢీ అనే నాయకత్వాన్ని పోటీలో పెట్టాలని చంద్రబాబు అంటున్నాడు. ఆ లెక్కన మొదట కుప్పంలో టీడీపీ అభ్యర్థిని మార్చాల్సి ఉంటుంది. కుప్పంలో టీడీపీ అడ్రస్‌ లేకుండా గల్లంతు అయ్యింది. ఎన్టీ రామారావు కష్టపడి పార్టీ పెడితే చంద్రబాబు అప్పన్నంగా వచ్చిన అధికారంతో టీడీపీని సీబీఎన్‌ టీడీపీగా మార్చారు. చంద్రబాబు అనేళ్ల పాలనలో ఒక క్రెడిట్‌ చెప్పమనండి. చంద్రన్న కానుక తీసేశారని చెప్పుకుంటాడు. రంజాన్‌ తోపా, అన్న క్యాంటీన్లు తీసేశారని అంటున్నాడు.  రాష్ట్ర పాలన చేసేవారు ఇలాంటి పథకాలా అమలు చేసేది. ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటూ ఓట్లు వేశారని డబ్బులు ఇస్తే ప్రజలు నమ్ముతారా? రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. ఆలాంటి వ్యక్తిని ఏమనాలో అర్థం కావడం లేదు.

మీరు క్రియేట్‌ చేసిన చెడు సంప్రదాయాలు సరైనవి కాదు. చంద్రబాబు కాంగ్రెస్‌లోనే ఉండి ముఖ్యమంత్రి అయి ఉంటే గొప్ప. మామ పార్టీని లాక్కుని అధికారం చెలామణి చేయడం, గల్లీ రాజకీయాలు, ఎమ్మెల్యేలను అమ్మడం, కొనడం, రాత్రికి రాత్రి పొత్తులు పెట్టుకోవడం ఇదే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం. ఇప్పటికైనా ప్రజల్లో మాకు విశ్వాసం ఉందని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఆయన బతుకంతా కూడా ఊతక్రరలపై నిలబడటం, వేరోకరి భుజం పట్టుకోవడం, గడ్డం పట్టుకోవడమే. 
ఎన్నికల సమయంలో ఎవరైనా సరే నాలుగు ఓట్లు చీల్చాలి. ఇక్కడ నాలుగు ఓట్లు వస్తాయా అనే రాజకీయాలే. వైయస్‌ జగన్‌ ఓటు బ్యాంకు తగ్గించాలన్నదే చంద్రబాబు దృష్ట సంప్రదాయాలు. అలాంటి వాటికి వైయస్‌ జగన్‌ స్వస్తీ చెప్పబట్టే ప్రజలు ఆయన్ను నమ్ముతున్నారు. నా వాడి ద్వారా వెళ్తేనే ఓటు వస్తుందనే ఆలోచన, నా కులం వాళ్లు వెళ్తేనే ఓట్లు వేస్తారనే సంప్రదాయం వైయస్‌ జగన్‌కు లేదు. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా వైయస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారు కాబట్టే ఆయన్ను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top