ఘ‌నంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుక‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుక‌ల‌ను పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ సీనియ‌ర్ నేత‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, శాస‌న‌మండ‌లి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల  అప్పిరెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్, ఎమ్మెల్సీ త‌ల‌శిల ర‌ఘురాం.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల స‌మ‌క్షంలో స‌జ్జ‌ల కేక్‌క‌ట్ చేశారు. 

ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి మిత్రమా..
పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ``నా చిరకాల ఆత్మీయ మిత్రుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అయన సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. మరెంతో ఉన్నత స్థితికి వెళ్లాలని.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి మిత్రమా`` అంటూ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top