తిరుపతిలో గెలుపు మాదే

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తిరుపతి ఎన్నికల ప్రచారంలో టీడీపీ, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయి

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అమలు చేశాం

 పవన్‌ కల్యాణ్‌ నటుడు..చంద్రబాబు సహజ నటుడు

 గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబులో మార్పు లేదు

తాడేపల్లి:  తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్‌సీపీదే విజ‌య‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘పవన్‌ కళ్యాణ్‌ నటుడు.. చంద్రబాబు రాజకీయాల్లో సహజ నటుడు’ అని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. టీడీపీ, బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత ఎన్నికల్లోనే ప్రజలు ఈ రెండు పార్టీలను  ఛీ కొట్టినా వారిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామన్నది ఆ పార్టీ నేతలు చెప్పలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే, ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని చురకలంటించారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రభుత్వం, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిందని సజ్జల పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లభ్దిదారులకు అందాల్సిన సొమ్మును నేరుగా వారి ఖాతాలోకే జమ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన రాళ్లదాడి హైడ్రామాను ప్రజలు గమనించారన్నారు. ‘టీడీపీ పనైపోయింది’ అని ఆ పార్టీ రాష్ట్ర అ‍ధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా చెప్తున్నారని విమర్శించారు. లోకేష్‌ దెబ్బకు టీడీపీ దివాళా తీసిందని ఆ పార్టీ నేతలే అంటున్నారని, దీన్నిబట్టి ఆ పార్టీ నేతలకి టీడీపీ పట్ల ఏమాత్రం చిత్తశుధ్ది ఉందో తెలిసిపోతుందన్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో టీడీపీ, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిప‌డ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అమలు చేశామ‌న్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నామ‌ని చెప్పారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామ‌ని వివ‌రించారు. అధికారంలో ఉండగా టీడీపీ, బీజేపీ ఏం చేశాయో చెప్పలేకపోతున్నాయని విమ‌ర్శించారు. 
 అప్పుడు ప్రజలను మోసం చేసి..ఇప్పుడు నాటకాలాడుతున్నారు.  వ్యక్తిగత విమర్శలతో పాటు ..మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారని మండిప‌డ్డారు.   గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబులో మార్పు లేదు. రాళ్ల దాడి జరిగిందన్న చంద్రబాబు డ్రామాను ప్రజలు గమనించార‌ని పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top