బడుగు,బలహీనవర్గాల తలరాతలు మార్చిన దేవుడు జగనన్న

పేదరికం లేకుండా చేయాలన్నదే జగనన్న లక్ష్యం: డిప్యూటీసీఎం నారాయణస్వామి

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు సామాజిక న్యాయం చేసి చూపారు జగనన్న:    ఎంపీ గోరంట్లమాధవ్‌

అణచివేత వర్గాలకు ఆత్మవిశ్వాసాన్నిచ్చి,వారి సామాజికస్థాయిన పెంచారు జగననన్న ఎంపీ గురుమూర్తి

కులవివక్ష లేకుండా చేయాలన్నదే జగనన్న తపన:  ఎంపీ సంజీవ్‌కుమార్‌

జగనన్న పాలన ఓ సామాజిక విప్లవo: ఎమ్మెల్యే సుధాకర్‌

సంక్షేమానికి, అభివృద్ధికి వైయ‌స్ జగన్‌ పాలనే సూచి : ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

 నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గంలో సామాజిక సాధికార యాత్ర

నంద్యాల‌: పాణ్యం నియోజకవర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్ర విజయవంతం అయింది. జనం భారీగా తరలివచ్చారు. నాలుగుమండలాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. దారెంబడి ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీసీఎం నారాయణస్వామి, ఎంపీలు గోరంట్లమాధవ్,గురుమూర్తి,సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యే సుధాకర్‌లు ప్రసంగించారు. డిప్యూటీసీఎం నారాయణస్వామి, ఎంపీ సంజీవ్‌కుమార్‌ ప్రసంగాలు బావున్నాయి. సభ పూర్తయ్యేవరకు జనం అసాంతం కదలకుండా ఉన్నారు. ఉపన్యాసాలు విన్నారు.

డిప్యూటీ సీఎం నారాయణస్వామి

–మనం ఎప్పుడు కనివిని ఎరుగని సామాజిక సాధికారతను మనకు అందించాడు జగన్‌మోహన్‌రెడ్డి
– పేదలందరూ బాగుండాలి, వారి తలరాతలు మారాలి, వారి పిల్లలు పెద్ద చదువులు చదవాలని జగనన్న తపిస్తారు.
– పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటి గడపల దగ్గరే అందిస్తున్నారు.
–పేద పిల్లలకు కార్పొరేట్‌స్థాయి చదువులు సర్కారు బడులకే తీసుకొచ్చారు జగనన్న.
– మాట ఇస్తే తప్పని జగనన్న పేదల పాలిట పెన్నిధి.
– పేదలందరికీ రూ.25లక్షల వరకు ఉచితవైద్యం అందించేలా ఆరోగ్యశ్రీని బలోపేతం చేసిన జగనన్న మామూలు రాజకీయనాయకుడు కాదు.
– కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు  చేసే చంద్రబాబు ఎక్కడ? ప్రజలను నమ్ముకుని..వారి మంచికోసం పాలన చేస్తున్న జగనన్న ఎక్కడ?
– జగన్‌ పాలనలో వివక్షకు చోటు లేదు. అదే బాబు పాలనలో అడుగడుగునా వివక్షే. 
– పార్లమెంటులో స్థానాలు, శాసనసభ,శాసనమండలి,స్థానిక సంస్థల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు స్థానాలు కల్పించిన సామాజికసాధికార నేత జగన్‌ మోహన్‌రెడ్డి.
– పేదరికం పోవాలి. అంతవరకు నేను పోరాటం చేస్తానంటున్న జగనన్న గురించి మనం ఆలోచించాలి. జగనన్న వస్తేనే మనకు సంక్షేమపథకాలు. 

ఎంపీ గురుమూర్తి
– ఈ నాలుగున్నరేళ్లలో జగనన్న పాలనలో మనమంతా ఎంతో లబ్దిపొందాం. సంక్షేమపథకాలు మన ఆర్థికస్థాయిని పెంచాయి.
– జగనన్న సామాజిక సాధికారత బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల తలరాతలే మార్చింది. డిప్యూటీసీఎంలతో సహా మంత్రుల్ని,ఎంపీ,ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ల ఛైర్మన్లను చేసింది.
–చంద్రబాబు పాలనలో అన్నీమోసాలే. ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టడమే. ప్రజలను మభ్యపెట్టి, ఓట్లేయించుకుని, అవసరం తీరాక వదిలేసేవాడు చంద్రబాబు
– జగనన్న ఉంటేనే మన బతుకుల బాగుంటాయి. మన పిల్లల భవిష్యత్తు బావుంటుంది.

ఎంపీ సంజీవ్‌కుమార్‌
– సామాజిక సాధికారత, సామాజిక న్యాయమంటే అసలు సిసలు అర్థం చెప్పిన నాయకుడు జగనన్న.
–గతంలో ఎస్సీ,ఎస్టీలు కులవివక్షతో ఎంత హీనంగా బతికారో,  ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. మన పిల్లలు చదువుకోలేని పరిస్థితులు ఆరోజుల్లో ఉండేవి.
– జగనన్న  ఈ కులవివక్షపై దాడే చేశారు. తన పాలనలో బడుగు,బలహీనవర్గాలకు పెద్దపీట వేశారు. సామాజికంగా,రాజకీయంగా,ఆర్థికంగా వారి స్థాయిని పెంచారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.
– మహిళలు అనుకుంటే ప్రభుత్వాలు నిలబడతాయి. మహిళలు అనుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. స్త్రీశక్తి అపారమైంది. ఆ స్త్రీశక్తే ఈరోజు జగనన్నకు అండగా నిలబడాలి. ఆయన పథకాలను గుర్తుచేసుకోవాలి. పథకాల వల్ల మారిన మన జీవనస్థాయిలను గుర్తుంచుకోవాలి. మళ్లీ జగనన్న వస్తే ..మన జీవితాల్లో వెలుగులు కొనసాగుతాయి
– జగనన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల విలువ తెలిసిన నాయకుడు జగనన్న. జగనన్న మనకు అండగా ఉన్నాడు. మనం ఆయనకు అండగా ఉండాలి.
 

ఎంపీ గోరంట్లమాధవ్‌

–సంక్షేమ పథకాలతో జగనన్న విప్లవాత్మకమార్పులే తీసుకొచ్చారు.
– బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలలో నాయకత్వ లక్షణాలు పెంచి, వారిని నాయకులుగా తీర్చిదిద్దారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.
– ప్రత్యేకహోదాను మోదీకి అర్పించుకుని, ప్రత్యేకప్యాకేజీని జేబులో వేసుకున్నవాడు చంద్రబాబు. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించాడు.
–హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే అవకాశాన్ని వదిలిపెట్టినవాడు చంద్రబాబు. ఓటుకు నోటు కేసులో భయపడి పారిపోయివచ్చిన వాడు చంద్రబాబు
– వ్యవసాయాన్ని దండగ అన్న చంద్రబాబు, మహిళల్ని సైతం హామీల పేరుతో మోసం చేసినవాడు చంద్రబాబు.
–బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలను అవమానించి, చులకనగా చూసినవాడు చంద్రబాబు.

ఎమ్మెల్యే సుధాకర్‌
– సామాజిక సాధికారత వల్లే బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ కుటుంబాలు బాగుంటాయి అని జగనన్న నమ్మారు. ఆ దిశలోనే చర్యలు తీసుకున్నారు. మన తలరాతలు మార్చే దిశలో ముందడుగులు వేస్తున్నారు. 
– జగనన్న పాలన ఓ విప్లవం. పారదర్శకంగా సాగుతున్న సామాజిక విప్లవం
– జగనన్నను మళ్లీ గెలిపించుకోవడం మనకు అవసరం. మన పిల్లల భవిష్యత్తుకు జగనన్నే మళ్లీ రావాలి. జగనన్నే కావాలి.

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

–మన అందరి తలరాతలు మార్చే జగనన్నను ప్రేమించాలి. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. 
–సర్కారు బళ్ల రూపురేఖలు మార్చారు జగనన్న. 
–మన పిల్లలు సగర్వంగా తలెత్తుకుని బళ్లకు వెళ్లేలా చేశారు జగనన్న. 
– అక్కాచెల్లెమ్మలకు ప్రతి పథకం ఇంటివద్దకే వచ్చేలా చేశారు జగనన్న
– లంచాలు లేవు. వివక్ష లేదు. పారదర్శక పాలన చూస్తున్నాం.
– చేయూత,ఆసరా, సున్నావడ్డీ రుణాలు, ఇళ్లస్థలాలతో పాటు, ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు పెద్ద భరోసా నందిస్తున్నారు సీఎం జగనన్న.

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి
–బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు స్థానిక సంస్థల్లోను, శాసనసభ,శాసనమండలి, లోక్‌సభ, రాజ్యసభల్లో పదవులిచ్చి...వారి రాజకీయ స్థాయిని పెంచారు జగనన్న. అంతేకాదు వారి ఆత్మగౌరవాన్ని పెంచారు.
– పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి విండ్‌పవర్‌; సోలార్‌ పవర్‌లకు సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాటుతో ఇక్కడ అభివృద్ధికి బాటలు పడ్డాయి.
– ఓర్వగల్లు ప్రాజెక్టులను నిలబెట్టాం. అవుకు రిజర్వాయర్‌కు కూడా నీళ్లిచ్చే స్థాయికి వచ్చాం.
– ప్రజలకు మరీ ముఖ్యంగా పేదప్రజలకు మేలు చేయాలన్న తపన ఉన్న మహానేత వైయస్సార్‌. ఆ తపన ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిలో కనిపిస్తోంది.
–రూ.25లక్షల వరకు వైద్యసేవలందించే స్థాయికి ఆరోగ్యశ్రీని పెంచిన జగనన్న..పేదలకు గొప్పవరమే అందించారు.
– ఇచ్చిన మాటపై నిలబడటం జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం. ఆయన్ను నమ్మితే మనకు మంచి జరుగుతుంది.
– వట్టిమాటలు చెప్పే ఎంతోమంది నాయకులను చూశాం. కానీ ప్రజలకు గట్టిమేలు చేస్తున్న సీఎం జగనన్న మాటల మనిషి కాదు. చేతల మనిషి. ప్రజానాయకుడు.
 

Back to Top