గుంటూరు: సభలో మంత్రుల మాటలు దారుణంగా ఉన్నాయని.. రండిచూసుకుందాం.. సిగ్గుందా అంటూ మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రిషికొండ భవనాలు ప్రభుత్వ భవనాలుగా కట్టాం. సీఎం, డిప్యూటీ సీఎం అందరూ చూసి వచ్చారు కదా? తత్కాలిక భవనాలకు అమరావతిలో ఫర్నిచర్‌తో కలిపి ఎస్‌ఎఫ్‌టీ 14 వేలు ఖర్చు చేశారన్నారు. రుషికొండలో కట్టినవన్నీ ప్రభుత్వ భవనాలు. ఆ భవనాలన్ని బాగా కట్టారని సీఎం, డిప్యూటీ సీఎం లే చెప్పారు కదా.. అందులో ఏదైనా లోపం జరిగితే విచారించుకోండి. అవి ప్రభుత్వ భవనాలు, వైయస్ జగన్ సొంత భవనాలు కాదు కదా అని బొత్స ప్రశ్నించారు. రుషికొండ భవనాలకు అనుమతులున్నాయని శాసన మండలిలో ఈ విషయాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రకటించారు. రుషికొండ పర్యాటక భవనాలకు సీఆర్‌జెడ్, జీవీఎంసీ అనుమతులు ఉన్నాయన్నారు.