పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి

గోదావరి జలాల అధిక వినియోగానికి ప్రణాళికలు రూపొందించాలి

సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు

త్వరలో పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన

6న మరోసారి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.జల వనరుల శాఖ అధికారులతో  సీఎం  సమీక్ష నిర్వహించారు. త్వరలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని  తెలిపారు.గోదావరి జలాలను సాధ్యమైనంతగా వినియోగానికి  ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. పోలవరం సహా,సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు.ఆరున మరోసారి సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష  నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఉన్న ప్రాజెక్టులపై అధికారులకు సీఎం జగన్‌ కొన్ని  సూచనలు చేశారు.రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీలులేదని తెలిపారు.

గత ప్రభుత్వం టెండర్ల వ్యవహారం సంబంధించి అంశాలను అంచనా వేయాలని అధికారులకు సూచించారు.ప్రాజెక్టుల  నిర్మాణం పారదర్శకంగా చేపట్టాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజేయ్‌ కల్లాం,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్,జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్,ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనా«థ్‌ దాస్,సీఎంవో ముఖ్య కార్యదర్శి ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Back to Top