గుంటూరు జిల్లా: జైలు నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి విడుదలయ్యారు. గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో అరెస్టై 107 రోజులపాటు జైలులో ఉన్న ఆయన, విడుదల అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గుండ్లపాడులో జరిగిన డబుల్ మర్డర్ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని, హైదరాబాదులో నివసిస్తున్న సమయంలో ఈ కేసులో అక్రమంగా తనను ఇరికించారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా 107 రోజులపాటు జైలులో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి ఇరికించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయపోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ కేసులో నిజాలు బయటపడే వరకు తాను పోరాటం ఆపబోనని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.