సామాజిక న్యాయం దక్కించడమే వైయ‌స్ఆర్‌ సీపీ ధ్యేయం 

రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు

బీసీలకు సామాజిక న్యాయం ఇవ్వాలంటే ముందు రాజ్యాధికారం ఇవ్వాలి‌.  

చంద్రబాబు చేసింది సామాజిక న్యాయం కాదు. ఎన్నికల కొసం మభ్య‌పెట్టే కార్యక్రమం తప్ప స్వతహాగా చేసిందేం లేదు.

పద్నాలుగేండ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు బావజాలం రాజ్యాధికారం ఏనాడు ఇవ్వలేదు‌. రాజ్యసభకు ఒక్క బీసీని అయినా చంద్రబాబు  పంపించలేదు.. ప్రజలు నమ్ముతారా?

కేవలం వైయ‌స్ జగన్ ఐదేళ్లలో నలుగురు బీసీ లను రాజ్యసభకు పంపించారు.

కరుడుగట్టిన బ్లాక్ వర్డ్ క్లాస్ వ్యతిరేక బావజాలం ఉన్నవారు బాబు. రాజ్యధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎలా అవుతుంది.

చంద్రబాబు లేదా టిడిపి నేతలు ఎవరితో అయినా బిసిలకు జరిగిన సామాజిక న్యాయంపై చర్చకు సిద్దం.

బిసిలకు కత్తి , డొక్కు , సైకిల్ ఇవ్వడమా సామాజిక న్యాయం.

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబు కు బీసీలు గుర్తుకొస్తారు.

ఒక లక్షా ఇరవై రెండు వేల కొట్లు బిసిల ఎకౌంట్లలో చేరవేసి నయా పైసా లంచం తిసుకొలేదు.

చట్ట సభల్లో వైయ‌స్ఆర్‌సీపీ బ్లాక్ వర్డ్ క్లాసులకు పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చింది. ధనవంతులను మాత్రమే చంద్రబాబు ఎంపిక చెస్తారు.

జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలను దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది చెందింది..అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాం 

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉంది.

వెనుక బడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజదాని పెడితే టీడీపీ నాయకులు చూసి ఓర్వలేక పోతున్నారు

వెనుజులా , శ్రీలంక అయిపొద్దని చెప్పి..తాము అధికారంకు వస్తే అన్ని ఇస్తాం అని చెబుతున్నారు. అలా చెప్పడానికి సిగ్గు లేదా.

అభివృద్ధి అంటే ఒక‌కుటుంబం అవసరాలు తీర్చిదిద్దె విధంగా ఉండాలి.

టీడీపీ, వైయ‌స్ జగన్ సిద్దాంతాలకు ఎక్కడా పొంతనలేదు.

వైయ‌స్ జగన్ పాలన ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉంది..

చంద్రబాబుకి విశాల భావజాలం లేదు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అంగీకరించలేదు:  మంత్రి ధ‌ర్మాన‌

శ్రీ‌కాకుళం:  సామాజిక న్యాయం దక్కించడమే వైయ‌స్ఆర్‌ సీపీ ధ్యేయమ‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. మన రాజ్యాంగం దేశంలో ఉన్నటువంటి పౌరులకు మూడు విధాలుగా న్యాయం చేయమని ఆదేశిస్తుంది. అయితే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు సంబంధించి వాళ్లకు కావాల్సింది సామాజిక న్యాయమ‌న్నారు. సామాజికంగావారికి విలువ లేకపోవడం వల్ల వారిని బ్యాక్ వర్డ్ క్లాస్ అంటామ‌న్నారు. ఆ సామాజిక స్థితిని పెంచాల‌ని రాజ్యాంగం ఆదేశిస్తోంద‌న్నారు. ఆలోచన కలిగిన ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దంగా ఏం చేయాలంటే సామాజిక న్యాయం ఇవ్వాలనుకున్నప్పుడు ముందు రాజ్యాధికారం ఇవ్వాలి. ఆర్థికమయినటువంటి స్థితిని పెంచేటటువంటి పని జరగాలి. ఈ రెండూ జరిగితేనే సామాజిక న్యాయం లభిస్తుంద‌న్నారు. సామాజిక న్యాయం మాటలతోనే సాధ్యం కాదు. మాటలు చెప్పినంత మాత్రాన సామాజిక న్యాయం రాదు. నన్నడిగితే చట్టంతో కూడా రాదు. చట్టంతో కొన్ని ఉద్యోగాలు వస్తాయి. చట్టంలో రిజర్వేషన్లు ఉంటే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ త్వరగా వాళ్లు అందుకోవాలి అంటే రెండు రకాల కార్యక్రమాలు ఏ ప్రభుత్వం అయినా చేస్తే అప్పుడు వాళ్ల స్థితి గతులలో మార్పు వచ్చి సామాజిక న్యాయం లభించి, బ్యాక్ వర్డ్ క్లాసెస్  అప్ లిఫ్ట్ అవుతాయి. వాళ్లు ఆ రోజున సంతోషంగా ఉండగలుగుతారు. అని రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు.

శ్రీ‌కాకుళం న‌గ‌రంలోని టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు.
 

ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాయ మాటలు చెప్పే వారే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి హామీలు ఓటర్లకు ఇస్తారే తప్ప స్వతహాగా బ్యాక్ వర్డ్ క్లాస్  వాళ్లు సామాజికంగా ఎదగాలన్న ఆలోచన అన్నది ఆయనకు లేదు. వారికి అవసరం అయిన రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచన ఏనాడూ ఆయన చేయలేదు. చేయరు కూడా,  అటువంటి దాఖలాలు కూడా లేవు. ఆయనేమీ ఇప్పుడొచ్చినటువంటి నాయకుడేమీ కాదు కదా ఆయన ఆల్మోస్ట్ పద్నాలు గేళ్లు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. నలభై సంవత్సరాలు రాజకీయాలలో అనుభవం ఉన్నవారు. ఆయన భావజాలం మీరు చూస్తే ఏనాడూ అతడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దానికి ఒక్కటే ఒక్క ఉదాహరణ చెబుతాను. 

ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యసభకు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారిని  చంద్రబాబు పంపించలేదంటేనే .. ఆయన రాజకీయ అధికారం బీసీలకు ఇస్తారు అని అంటే ఎవ్వరయినా నమ్ముతారా ? అని ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలెవ్వరయినా,బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారెవ్వరయినా నమ్ముతారా ? ఆయన తరువాత జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన రాజ్యసభకు నలుగురు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారిని పంపించారు. 
మొదట ఆయన ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలోనే ఐదుగురు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారిని పెద్దల సభకు పంపించారు. మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు. ఏనాడయినా మీరు ఈ విధంగా రాజకీయ అధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదే ? అంటే ఏంటి ?.  చంద్రబాబు భావజాలంలోనే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్న కోణం లేదు మొదట్నుంచి. వీళ్లకు అధికారం ఇచ్చి వాళ్లను బలోపేతం చేసే పనులు మీరు ఏనాడూ చేయలేదు. 
నేను ఎనలైజ్ చేసిన విషయాలైతే ఇవి. అధికారాన్ని అలాంటి వారికి ఇవ్వకూడదన్న భావనలో ఉన్నారు మీరు. అందుకే ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఎవ్వరైనా అత్యున్నత న్యాయస్థానానికి  బ్యాక్ వర్డ్  క్లాస్ వారు జడ్జీలుగా పనికి రారు అని  ఉత్తరం రాస్తారా ? అంటే కరడుగట్టినటువంటి బ్యాక్ వర్డ్ క్లాస్ వ్యతిరేక భావాలు మీలో నాటుకుని ఉన్నాయి కనుక, అలాంటి పొజిషన్లలోకి బ్యాక్ వర్డ్ క్లాసెస్ వారు రాకూడదు అనే భావజాలం కలిగి ఉన్నారు మీరు.

మీ పార్టీ పక్కన బెట్టండి. అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు వ్యతిరేకి మీరు(చంద్రబాబు). అది మేం చెప్పింది కాదు. మీరు రాసిన ఉత్తరం కాని,గడిచిన ఐదేళ్లలో మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లియర్ గా చెబుతోంది కదా  నిన్న జయహో బీసీ అని అన్నారు. రాజ్యాధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎలా అవుతుంది ? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కల్పించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారం ఇవ్వాలి. ఇస్తే ఆటోమెటిక్ గా సామాజిక న్యాయం సాధ్యం అవుతుంది. బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు సామాజిక న్యాయం కదా  ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, తెలుగు దేశం పార్టీకీ ఒక డిబెట్ కనుక మీరు పెడితే,డిబెట్ కు మీరు వస్తామన్నా,మీ తాలుకా వ్యక్తులు ఎవ్వరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడేందుకు సిద్ధం. 

ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ బద్దంగా బీసీల ఎదుగుదలకు అటు రాజ్యాధికారం ఇచ్చి,ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగించి,సామాజిక న్యాయం అందించినటువంటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని నేను రుజువు చేస్తాను. మీరు చేయలేదని కూడా రుజువు చేస్తాను. మీరెవ్వరయినా చర్చకు వస్తే, మాట్లాడేందుకు నేను సిద్ధం. మీరెవ్వరని అయినా చర్చకు పంపించినా,లేదా మీరొచ్చినా మాట్లాడేందుకు నేను సిద్ధం అని మనవి చేస్తున్నాను. ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు ఒక వేదిక మీదకు రావాలని చెబుతున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మాటలు చెప్పడం కాదు. చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బీసీ, ఎన్నికలు అయిపోయాక అసలు ఆ ఊసే ఉండదు మీ దగ్గర.

ఇలాంటి జయహో బీసీ సభలు ఇంతకుముందు చాలా సార్లు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఎన్నిక అయిపోగానే సంబంధిత కాగితాలు చింపి అవతల పారేశారు. డిక్లరేషన్ల ఊసే లేదు. ఇవాళ మిమ్మల్ని నమ్మమంటే ఏ బీసీ నమ్ముతాడు. మా పార్టీలో  లోక్ సభలో ఆరుగురు పార్లమెంట్ సభ్యులు బీసీలు ఉన్నారు, నలుగురు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. బీసీలకు చెందిన వారే వారంతా. చూస్కోండి. ఎప్పుడయినా మీరు ఆ విధంగా పార్లమెంట్ కు సంబంధించి ఎగువ సభకు కానీ దిగువ సభకు కానీ ఆ విధంగా పంపగలిగారా ? అని ప్రశ్నిస్తున్నాను. చేయగలిగారా ?.11 మంది మంత్రులు రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్నారు. సరే ఇతర కార్పొరేషన్లు అంటే యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి,సంబంధిత వర్గాలకు లీడర్ షిప్ ఇచ్చారు. మీరు దానిని విమర్శిస్తారు. విమర్శించడం కాదు లీడర్ షిప్ ను డెవలప్ చేయాలి. ప్రజా స్వామ్యంలో ప్రభుత్వాలు,బడ్జెటింగ్ వీటికి సంబంధించిన సమాచారం తదితర వివరాలు తెలుసుకునేటటువంటి లీడర్ షిప్ ను డెవలప్ చేయాలి. మీరెప్పుడూ అది చేయలేదే ? ఎన్నికలు వస్తున్నాయి కనుక జయహో బీసీ అంటే అవుతుందా ? 

నిజంగా మీరెప్పుడయినా బీసీ సంక్షేమం కోసం పాటుపడ్డారా ? పాల వ్యాపారం చేసుకునే వారుంటే వారికొక డొక్కు సైకిల్ ఇవ్వడం, ఇస్త్రీ పెట్టె ఇవ్వడం.. వాటిపై మీ బొమ్మలు వేసుకోవడం..ఇవా బీసీల సామాజిక స్థితిగతులు మారడానికి సహకరిస్తాయా ? ఇవి కాదు కదా ఇవి చేస్తూనే రాజ్యాధికారం ఇవ్వాలి. ఆర్థికంగా వారిందరికీ చేయూత ఇవ్వగలగాలి.  కానీ ఆ రోజు ప్రొగ్రాంలు పెట్టడం వాటిలో కొన్నింటిని మాత్రం పంచి మిగిలినవి సొంత మనుషుల ఖాతాల్లోకి చేర్చేయడం వంటి పనులెన్నింటినో గత ప్రభుత్వ హయాంలో మీరు చేశారు. అలాంటివి మీరు ఈ ఐదేళ్లలో చూశారా ? డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు ఇచ్చిన డబ్బెంతో తెలుసా ? లక్షా 22 వేల కోట్ల రూపాయలు అందించాం. ఇంత మొత్తాన్ని బ్యాక్ వర్డ్ క్లాసెస్ అకౌంట్లలోకి చేరవేశాం. ఇందుకుగాను మీలా ఏ ఒక్కరు కూడా ఒక్క నయాపైసా లంచం అని,కమీషన్ అని,మధ్యవర్తి అని లేకుండా చేశాం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 
నాన్ డీబీటీ ఇంకా వేరుగా ఉంది. మీరు సబ్ ప్లాన్ అంటున్నారు. సబ్ ప్లాన్ అంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి చూపించిన ప్రభుత్వం ఇది. బ్యాక్ వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. ఆ అర్హత మీకు లేదు. వెనుకబడిన వర్గాలను మోసగించినటువంటి ప్రభుత్వం మీది. ఇప్పటికీ మీరు అదే చెబుతారు సైకిళ్లు ఇస్తాం..డొక్కులు ఇస్తాం.. కత్తులు ఇస్తాం అని చెబుతారు. ఇవి కాదండి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. రాజకీయ స్వాతంత్ర్యం కావాలి. సమాజంలో వారి స్థితి పెరిగేందుకు ఏమయినా అవకాశం ఉంటే అందుకు తగ్గ పనులు చేయగలగాలి. 
నాయీ బ్రాహ్మణులను తీసుకోండి. వారి ఆర్థిక స్థోమత పెరిగేందుకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా వారికి సహకారం అందించాం. వారికి ఒక క్షౌరశాల ఉంటే డైరెక్టుగా డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేశాం. ఏడాదికి పదివేలు రూపాయలు అందించాం. వారి విద్యుత్ బిల్లులను కొంత తగ్గించి,ఊరట ఇచ్చాం. చేస్తున్న వృత్తికి సంబంధించి ఛార్జీలు పెంపు చేసేందుకు అనుమతి ఇచ్చాం. వృత్తిని  ఎవ్వరైనా అగౌరవ పరిస్తే అట్రాసిటీ కేసులు నమోదు చేసేందుకు వీలుగా చట్టాన్ని సవరించాం. 

ఇవాళ ప్రతి దేవాలయంలో చివరికి తిరుపతిలో కూడా ఓ నాయీబ్రాహ్మణుడు ట్రస్ట్ బోర్డులో మెంబర్ గా ఉండే అవకాశం ఇచ్చాం. ఇది కదా సామాజిక న్యాయం అందించడం అంటే.. అని మీకు విన్నవిస్తూ ఉన్నాను. మీరు మామాలుగా మాటలు చెబితే సామాజిక న్యాయం దక్కదు. అలానే తీసుకోండి ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి. శెట్టి బలిజలలో రాజ్యసభ మెంబర్ ఉన్నారు. యాదవులకు పెద్ద ఎత్తున పార్లమెంట్ సీట్లు. అసెంబ్లీలో ఎన్నడూ లేనివిధంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు సీట్లు ఇచ్చింది. ఏనాడూ చంద్రబాబును ఈ పద్ధతుల్లో చూడలేదే ? ధనవంతులను ఎంపిక చేసే పనిలోనే చంద్రబాబు ఉన్నారే తప్ప  నిజమయిన సంప్రదాయ రీతులలో ప్రజల తరఫున పోరాడుతున్న బ్యాక్ వర్డ్ క్లాసెస్ లీడర్లను ఎప్పుడూ ఆయన గుర్తించ లేదు.

ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బీసీ అంటారు. ఎందుకు అంటారో తెలియదు. ? ఏ వర్గం ప్రయోజనం ఆశించి అంటారో కూడా తెలియదు ? ఏమిటి బీసీ ? ఏమిటి జయహో బీసీ ? మీరు చెప్పండి.  రాజ్యాధికారం దక్కించడంలో విశాల భావం ఉండాలి. మీకు ఆ దృక్పథం లేదు. మీ మాటలను ఎవ్వరూ నమ్మే విధంగా ప్రజలు లేరు అని మనవి చేస్తున్నాను. ఎంత కాంట్రడక్షన్  ఉంది మీ మాటలలో.. జగన్ పాలకు సంబంధించి మొదటి ఏడాది మీరు ఏం చెప్పారు ?  ఆ రోజు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు సాధ్యం కాదని చెప్పారు. అనుభవం ఉన్నవాడిగా చెబుతున్నాను ఇవన్నీ అసాధ్యం అని  చెప్పారు. అమలు చేస్తున్న సందర్భంలో మళ్లీ మాట మార్చారు. ఇంకెన్నాళ్లు చేస్తారు మరో ఆరు మాసాలలో సంక్షేమ పథకాల అమలు ముగిసిపోతుంది మరి చేయలేడు అని చెప్పారు. 

అయినా మీరు చెప్పిన విధంగా ఆగిపోలేదు. జగన్ పాలనలో రెండున్నర, మూడు సంవత్సరాల తరువాత మళ్లీ మీరు చెప్పారు. ఇలా చేసుకుంటూ పోతున్నారు ఈ రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని.. వెనుజులా అవుతుందని... దివాలా తీసేస్తుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ భారత ప్రభుత్వం ప్రకటించిన సూచీలు (ఇండికేటర్స్) మీరు చూస్తే జీడీపీ బ్రహ్మాండంగా మీ టీడీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ వృద్ధి మా ప్రభుత్వంలో నమోదు చేసింది అని కేంద్ర ప్రభుత్వ సూచీలు చెబుతున్నవి.  అన్ని రంగాలలో మీ కంటే అనేక స్థాయిలలో వృద్ధి పెరిగి అనేక రాష్ట్రాలను నెట్టుకుని ముందుకు వచ్చింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. మరి మీరేమో ఈ రాష్ట్రం వెనుజులా అయిపోందని అన్నారు. శ్రీలంక అయిపోతుందని అన్నారు. నాలుగేళ్లు అయిపోయింది. అప్పుడు మళ్లీ మీరు మాట మార్చారు. రాజమండ్రిలో సభ పెట్టి నేను కూడా ఇంత కన్నా ఎక్కువ ఇస్తానని మాట మార్చారు. ఆ నాలుగు సంవత్సరాలలో నాలుగు దఫాలుగా మాట మార్చారు. 

ఇప్పుడు ఐదో సంవత్సరం చెప్పినటువంటి మాట మార్చరని ఏంటి గ్యారంటీ ? ఇప్పుడు జయహో బీసీ అంటూ చెబుతున్న మాటలు మార్చరని ఏంటి గ్యారంటీ ? మీరు సిగ్గుపడడం లేదా దీనికి. అనుభవం లేని వారా మీరు ? ఇప్పుడే మీరు పార్టీ పెట్టారా ? 
మీదేమయినా కొత్త పార్టీనా ? ఈ రాష్ట్రానికి ఏమి వనరులు సమకూరుతాయి అన్నది మీకు బాగా తెలుసు కదా..ప్రభుత్వంలో బడ్జెటింగ్ ఎలా ఉండాలి ? దానికి లిమిటేషన్లు ఏంటన్నవి ? మీకు బాగా తెలుసు కదా..ఎందుకు మీరు చేయలేకపోయారు ? 
చేయలేకపోయారు అంటే మీ భావజాలంలోనే ఆ విధం అయిన ఆలోచన లేదు అని అంటాను నేను. ఆ విధం అయిన దృక్పథం మీలో లేదు అని అంటాను నేను. ఎప్పుడూ మీరు చెప్పుకునే మాటలకూ చేతలకూ సంబంధమే ఉండదు. అభివృద్ధి అంటే ఓ కుటుంబం అన్ని రంగాలలో సాధించినటువంటి అభివృద్ధిని మీరు చూడడమే లేదు. ప్రపంచంలో ఉన్న సంస్థలన్నీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అభివృద్ధికి..? వారు ఆరోగ్యంగా జీవించే స్థితి ఉండాలి. చక్కగా చదువుకుని పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలను అందుకునేటటువంటి విద్యా విధానం ఉండాలి. మంచి పోషకాహారం లభించాలి. నివాస యోగ్యం అయిన ఇల్లు ఉండాలి. పరిసరాలు బాగుండాలి. మంచి నీరు ఉండాలి. ఇవన్నీ లేకుండా అభివృద్ధి అనేదానికి అర్థం ఏముందని ? 
ఇవేవీ కాకుండా ఎవరి కోసం అభివృద్ధి. అభివృద్ధి ఆ రాష్ట్ర ప్రజల కోసం కాకుండా ఏ కొద్దిమంది ధనవంతుల కోసమో..పెద్ద పెద్ద భవంతులు చూపించి,రోడ్లు చూపించి ఇదే అభివృద్ధి అనేటటువంటి మీ తత్వానికి మీ సిద్ధాంతానికి మా పార్టీ సిద్ధాంతానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధాంతానికి ఎక్కడా పొంతనా లేదు. జగన్ గారి పాలన రాజ్యాంగం  చెప్పినటువంటి నిబద్ధత కలిగిన పాలన.ప్రపచంలో ఇతర దేశాలు అనుసరిస్తున్నటువంటి ప్రజల తాలుకా జీవన ప్రమాణాలు పెంచే పాలన. మీకూ మాకూ ఎక్కడా పొంతన లేదు. ఈ విషయమై మీరు వైఎస్సార్సీపీ తో  పోల్చి చూసుకోకూడదు. మీకు సాధ్యం కాదు. ఎందుకంటే మీ భావజాలం వేరు.  మీ భావజాలంలో ప్రజలకు మేలు చేద్దాం జీవన ప్రమాణాలు పెంచుదాం అన్నవి లేవు. ఇటువంటి ఉన్నత స్థాయి ఆలోచనలు లేనే లేవు. మీరు ఇవ్వలేరు. ఇదే మాట నేను పదే పదే చెబుతున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడూ చేయలేదు.

మీ చుట్టూ ఉన్నది ధనవంతుల కూటమి. ధనవంతుల ప్రయోజనాలను మీరు కాపాడగలరు కానీ పేద ప్రజల జీవన ప్రమాణాలను మీరు పెంచలేరు.  మీ చుట్టూ ఉన్న కోటరీని మీరు కాపాడగలరు కానీ పేద ప్రజల విషయమై ఆలోచన చేయలేరు. ఇదే విషయం అన్నింటా కనిపిస్తూనే ఉంది గత పాలనలో మీరు అందించిన పాలనలో. అందుకే అప్పుడూ ఇప్పుడూ అవే మాటలు చెబుతున్నారు. అత్యంత వెనుకబడిన నార్త్ కోస్టల్ ఏరియాలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతాం అంటే మీరు అంగీకరించడం లేదు. మీకు ఎక్కడుంది కాన్ఫిడెన్స్ ? విశాలం అయిన భావం ఎక్కడుంది మీకు. అందుచేత జయహో బీసీ లేదు.మీ కపట మాటలూ ఎవ్వరూ నమ్మరు. మీరు చెప్పే మాటలు అన్నీ ఎన్నికల్లో ఓటు పొంది తద్వారా అధికారం దక్కించుకునేందుకు కాక మరొకదానికి కాదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఎన్నికల ముందు గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన మోసపోయేందుకు ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు.అన్నటువంటుంది ఈ ప్రెస్ కాన్ఫిరెన్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. 

మీరు కనుక చర్చకు వస్తే,ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో మీతో వాదించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చేసిన పొరపాట్లు అన్నీ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి సూచీలు నేను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ జయహో బీసీని ప్రజలెవ్వరూ నమ్మవద్దు అని సూచన చేస్తూ బ్యాక్ వర్డ్ క్లాస్ కు  చెందిన నేతగా, చాలా కాలం ప్రభుత్వాలలో పనిచేసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అభ్యర్థిస్తూ  ఉన్నాను.  టిడిపి జయహో బీసీలో కపటం ఉంది, అందులో మాయ ఉంది. అందులో మోసం ఉంది. అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయి తప్ప  నిజమైనటువంటి సామాజిక న్యాయం,రాజకీయ అధికారం,ఆర్థిక స్వాతంత్ర్యం కలిగించే ఆలోచనలు అందులో లేనే లేవని మరోసారి విన్నవిస్తూ ఉన్నాను. బీసీలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయకత్వానికి కానీ సంబంధిత నాయకులకు కానీ లేనే లేదని ఈ సందర్భంగా నేను మరొక్కసారి మనవి చేస్తున్నాను. అని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

Back to Top