వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురం రిటైర్డ్‌ ఎస్‌ఐ వి.జయకుమార్‌

వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన జయకుమార్‌

తాడేప‌ల్లి: పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురంకు చెందిన రిటైర్డ్ ఎస్‌ఐ వి.జయకుమార్‌ బుధవారం వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శ్రీ వైయస్‌ జగన్‌ భవిష్యత్తులో సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తనను ఎంతగానో ఆకర్షించాయని జయకుమార్‌ వెల్లడించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైయస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, తదితరులు

Back to Top