తాడేపల్లి: సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నిలిచారని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ఇవాళ కృష్ణ జయంతి(Krishna Birth Anniversary) సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయనసోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణగారు(Super Star Krishna Gaaru) హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా, స్టూడియో అధినేతగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అల్లూరి పేరు చెబితే.. మనకు కృష్ణాగారే మదిలో మెదులుతారు. రాజకీయాల్లోనూ రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో అండగా నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నగారికి(వైయస్ఆర్) అత్యంత ఆప్తులు అయిన కృష్ణ గారి జయంతి సందర్భంగా నివాళులు అంటూ వైయస్ జగన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.