సెప్టెంబర్‌ 1 నుంచి నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ

తాడేపల్లి: సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బియ్యంలో నాణ్యత, పంపిణీలో పారదర్శకతే ధ్యేయమని, అవినీతికి పూర్తిగా చెక్‌ పెట్టాలని సూచించారు. కాలుష్య రహిత సంచుల వినియోగం ద్వారా  మొబైల్‌ వాహనాలల్లో గడప వద్దకే నాణ్యమైన బియ్యం అందించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. 
 

Back to Top