వికేంద్రీకరణకు మద్దతుగా మానవహారం

 ప్రకాశం జిల్లా: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. అనంతరం వందలాది మంది కార్యకర్తలతో మానవహారం నిర్వహించి మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు.
చంద్రబాబు తీరుపై ఇంచార్జ్‌ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్‌తో మురిపించి రాష్ట్ర ప్రజలను మోసం చేసారని బాలినేని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ తప్ప వెలగబెట్టింది ఏమి లేదని బాలినేని మండిపడ్డారు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో శాసన రాజధాని ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ముళ్ళకంపళ్లలో రాజధాని పెట్టి ఒక వర్గాన్ని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు కలలు కన్నారని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రాన్నీ కొల్లగొట్టేశాడని మంత్రి మండిపడ్డారు.

 మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష
 
 అనంతపురం జిల్లా: ఏపీలో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకించే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అనంతపురం జిల్లాకు చెందిన మేధావులు, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం నగరంలోని కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వికేంద్రీకరణ చేస్తానని ముందుకు వస్తే.. దాన్ని అడ్డుకుని స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకోవడం క్షమించరాని నేరం అన్నారు. దశాబ్దాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతోందని.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని అనంతపురం మేధావులు స్పష్టం చేశారు.

అధికార అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు అడుగడుగునా అడ్డుపడటం బాధాకరమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సత్యాగ్రహ దీక్ష చేపట్టిన వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానంటే.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయటం దుర్మార్గం అని మండిపడ్డారు.

శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దీక్ష జరగడం అభినందనీయం అని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణకు బాటలు వేసిన సీఎం వైయ‌స్ జగన్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేత కేవీ రమణ. కృతజ్ఞతలు తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top