మాజీ ఎ‍మ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత

 వైయ‌స్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ ఎం.వీ. రమణారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన కర్నూలు ఆస్సత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. ఎన్టీఆర్‌ను విభేదించి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రమణారెడ్డి రాయలసీమ విమోచన సమితిని ఏర్పాటు చేశారు. నిరంతరం రాయలసీమ హక్కుల కోసం పరితపించిన ఆయనకు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. రమణారెడ్డి మృతిపట్ల తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రమణారెడ్డి రచయిత, గొప్ప మేధావి అంటూ కొనియాడారు.  
 

Back to Top