ఎవరైనా సరే… ముందుగా నన్ను దాటుకుని మీ వరకు రావాలి

మాజీ మంత్రి  సాకే శైలజానాథ్ భ‌రోసా

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న‌, సోష‌ల్  కార్య‌క‌ర్త‌ల స‌మావేశం

అనంత‌పురం: ఎవరైనా సరే… ముందుగా నన్ను దాటుకుని మీ వరకు రావాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు, మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ పార్టీ శ్రేణుల‌కు భ‌రోసా క‌ల్పించారు. అనంత‌పురంలో నిర్వ‌హించిన యువజన–సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాకే శైలజానాథ్ కార్యకర్తలకు ధైర్యం నింపేలా ప్రసంగించారు.  ఆయ‌న మాట్లాడుతూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని, సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను బలంగా వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నిజాయితీతో పని చేస్తే ప్రజల ఆదరణ స్వయంగా వస్తుందని, కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ముందుకు సాగాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు సమన్వయం పెంచాలని నిర్ణయించారు. కార్యక్రమం చివర్లో నాయకులు పరస్పరం చర్చలు జరిపి భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికలు రూపొందించారు.  ఈ సమావేశంలో యువ నాయకుడు రుత్విక్, ఐటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ (ముకుందాపురం), ఐటీ వింగ్ జోనల్ ప్రెసిడెంట్ మంజునాథ్ యాదవ్, సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ షేక్ బాబా సలామ్, జాయింట్ సెక్రటరీ శ్యామ్ బేడదల, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు నరేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఐటీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే మండల కన్వీనర్లు శ్రీకాంత్ రెడ్డి, మహేశ్వర్, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర పాల్గొన్నారు.

Back to Top