తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంచా నాగమల్లేశ్వరి ఆక్షేపించారు. ఆమెకు పిచ్చిప్రేలాపనలు అలవాటుగా మారాయని, దీన్ని బట్టి ఆమె మానసిక స్దితి ఎలా ఉందో అర్దమవుతోందని తెలిపారు. ఇచ్చిన శాఖను గంగలో కలిపేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టం ఏంటో అర్ధం కావట్లేదన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల్ని నడిరోడ్డు మీద కొడుతోంది ఎవరో జనం చూస్తున్నారని, వాళ్లను కూటమి ప్రభుత్వం ఎలా కాపాడుతోందో కూడా చూస్తున్నారని నాగమల్లేశ్వరి మండిపడ్డారు. మావిగన్ పై సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ కు దిగుతున్నారని నాగమల్వేశ్వరి తెలిపారు. ప్రెస్ మీట్లో నాగమల్లేశ్వరి ఇంకేమన్నారంటే.. - మహిళలపై కూటమి ఎమ్మెల్యేల అకృత్యాలు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై హోంమంత్రికి ఏమాత్రం అయినా సానుభూతి ఉంటే న్యాయం చేసి అప్పుడు మాట్లాడండి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ మహిళలతో చేసిన వికృత చేష్టలపై చర్యలు తీసుకునే దమ్ముంటే చెప్పాలి. మరో ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ప్రిన్సిపాల్ పై చేసిన దాష్టికానికి న్యాయం చేసే దమ్ముంటే చేసి చూపించండి. మంత్రి సంధ్యారాణి పీఏ వేధింపులపై కూడా చర్చకు మేం సిద్దమే. వీటి మీద మాట్లాడే ధైర్యం, ఈ ఆడబిడ్డలకు న్యాయం చేసే దమ్ము ఉంటే ఈసారి హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టాలి. - మహిళలకు న్యాయం చేయలేక జగన్ గారిపై విమర్శలా ? ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిపై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీ పిచ్చిని రాష్ట్ర ప్రజలే వదిలిస్తారు. మీ పోలీసు డిపార్ట్ మెంట్లో మాచర్ల, పల్నాడులో జరిగిన ఘటనలపై హోంమంత్రి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. కానిస్టేబుల్ ను కూడా బదిలీ చేయించుకోలేని పరిస్ధితుల్లో మీరు ఉన్నారు. ఓ మాజీ సీఎం అన్నది కూడా మర్చిపోయే జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. మీ శాఖలో పనులు చేయట్లేదని చంద్రబాబు కోప్పడుతున్నారట. వాటిని కప్పిపుచ్చు కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారెని తిట్టుకోవడానికి ఇలా ప్రెస్ మీట్లు పెడుతున్నారని అర్థమవుతోంది. రాష్ట్రంలో దాచుకో, దోచుకో, పంచుకో ప్రాసెస్ లో ఉన్న టీడీపీ నేతలు వెన్నుపోటు గొడ్డలి అని మీ పార్టీకి పేరు పెట్టుకుంటే బాగుంటుంది. మీ పార్టీకి నీతుల చెప్పడమే తప్ప పాటించడం అలవాటు లేదు. మీరు ఒక వేలు చూపిస్తే, మీవైపు నాలుగు వేళ్లు చూపిస్తాయన్న విషయం తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా పెట్టించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్న విషయం హోంమంత్రి అర్దం చేసుకోవాలి. - మావిగన్ పై సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ వైయస్ఆర్‌సీపీలో కార్పోరేటర్ సీటు అడిగినట్లు మా వద్ద సమాచారం ఉంది. మా జగనన్న మీకు కార్పోరేటర్ సీటు ఇవ్వలేదనే కోపం పెట్టుకుని మీరు ఇవన్నీ మాట్లాడుతున్నట్లున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తన ప్రభుత్వం రాగానే కేసులన్నీ తీసేసుకోవాలని తెలియదు. మీ చంద్రబాబు మాత్రం తన ప్రభుత్వం రాగానే కేసులన్నీ రద్దు చేయించుకున్నారు. మావిగన్ ప్రభావం టీడీపీ నేతలపై బాగానే పడినట్లు కనిపిస్తోంది. అందుకే మా జగనన్నతో పాటు భారతమ్మను, ఇతర వైయస్ఆర్‌సీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలనే మాట మీకు ఎక్కడో నచ్చలేదు. అందుకే పిచ్చి మాటలతో మీడియా ముందుకు వస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకోండి. ప్రజలు మిమ్మల్ని గెలిపించారా లేక మీరు అడ్డదారుల్లో గెలిచారా అన్నది అందరికీ తెలుసు. ప్రజలు ఇచ్చిన అధికారంతో వారికి ఇచ్చిన హామీల్ని ముందు నెరవేర్చండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అదంతా వదిలేసి మా నాయకుల మీద వ్యక్తిగత దాడులకు దిగితే మాత్రం ఎట్టి పరిస్ధితుల్లో మిమ్మల్ని ఉపేక్షించబోమని నాగమల్లేశ్వరి హోంమంత్రిని హెచ్చరించారు.