తాడేపల్లి: దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆశా భోంస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆశా అద్భుతమైన కంఠం ప్రతి ఇంటిలోనూ ప్రతిధ్వనించాయి. ఆశా భోంస్లే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ‘ఓం శాంతి!’ అని పేర్కొన్నారు. ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.