వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన వైయ‌స్ జగన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సరికొత్త ఎత్తుకు చేరుకోవడానికి కలిసి పనిచేద్దామని ఆహ్వానించారు. ఈరోజు ట్విట్టర్ లో మోదీ స్పందిస్తూ..‘ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైయ‌స్ జగన్ కు శుభాకాంక్షలు. కేంద్రం నుంచి ఏపీకి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ సరికొత్త ఎత్తులకు చేరుకునేందుకు మనం కలసి పనిచేద్దాం’ అని ట్వీట్ చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top