బద్వేల్ ఉపఎన్నికలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ దే ఘన విజయం

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేప‌ల్లి: బద్వేల్ ఉపఎన్నికలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ దే ఘన విజయమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బ‌ద్వేలు ఉప ఎన్నిక కు సంబంధించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టర్స్ ను పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి గారు విడుద‌ల చేశారు. బ‌ద్వేలు ఉప ఎన్నికలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి డా.. సుధా ఘ‌న‌విజ‌యం సాధించ‌బోతోందని ఆయ‌న అన్నారు. ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా రాష్ర్టాన్ని అభివృద్ధి ప‌థంలో తీసుకు వెళ్తున్నార‌ని తెలిపారు. బీసీ, య‌స్‌సి, య‌స్‌టీ, మైనారిటీలు, మ‌హిళలకు అన్ని రంగాల‌లో పెద్ద‌పీట వేశార‌ని అన్నారు. ప్ర‌జ‌లంతా ఈ ఉప ఎన్నిక‌లో పూర్తిస్థాయిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌నున్నారని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో ఉత్త‌ర అమెరికాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి శ్రీ పండుగాయ‌ల ర‌త్నాక‌ర్,  న‌వర‌త్నాల ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ శ్రీ నారాయ‌ణ మూర్తి, గుంటూరు న‌గ‌ర మేయ‌ర్ శ్రీ కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు, డిప్యూటీ మేయ‌ర్ శ్రీ బాల వ‌జ్ర‌బాబు, పార్టీ నేత ప‌డ‌మ‌ట సురేష్ బాబు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top