పులివెందుల: కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి పులివెందులలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి లేదని పేర్కొంటూ అర్బన్ సీఐ పురుషోత్తంరాజు ఈ నోటీసులను అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్సీపీ నాయకులకు వరుసగా నోటీసులు జారీ చేస్తుండటంపై పార్టీ శ్రేణుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా భద్రత కల్పించడంతో పాటు, అన్ని రాజకీయ పార్టీల పట్ల పోలీసులు సమానంగా వ్యవహరించాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు.