శ్రీకాళహస్తిలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు

మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో శ్రీనివాసులురెడ్డి చేరిక

శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కాసరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీనివాసులురెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top