రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రులు 

గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న విశాల మైదానంలో ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వ‌హిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఏర్పాట్లును మంత్రి తానేటి వ‌నిత‌, జోగి ర‌మేష్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా తానేటి వ‌నిత మాట్లాడుతూ.. రాష్ర్టంలోని స్దానిక సంస్ధలనుంచి పార్లమెంట్ సభ్యుల వరకు దాదాపు 80 శాతం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్ధితులలో జరుగుతున్న ప్లీనరీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోందని తెలిపారు. ఇది ఓ పెద్ద పండుగ అన్నారు. రెండు రోజుల ప్లీనరీ సమావేశాలకు రాష్ర్టం నలుమూలలనుంచి కార్యకర్తలు హాజరవుతారు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ గర్వపడేలా రీతిలో నిర్వహించుకోవాలన్నారు. కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు.  వసతి, బోజనం, రవాణా వంటివాటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.  కార్య‌క్ర‌మంలో సీఎం ప్రోగ్రాం కో - ఆర్డినేటర్, ఎమ్మెల్సీ  తలశిల రఘురామ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి , ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి  త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top