తూర్పుగోదావరి జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నదే ప్రజల కోరిక అని పిఠాపురం వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత తెలిపారు. వైయస్ఆర్‌సీపీపై వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ప్రజల్లో సీఎం వైయస్ జగన్‌కు, వైయస్ఆర్‌సీపీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్నారు. ఫ్యాన్ గాలి జోరుగా, హుషారుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై ప్రజల్లో ధీమా ఉందని పేర్కొన్నారు. ఆయన రుణం తీర్చుకుంటామని ఓటర్లు చెబుతున్నారని తెలిపారు. ఇంటికి పెన్షన్ పంపి మా పేదరికాన్ని గౌరవించారని వృద్దులు చెబుతున్నారు. మళ్ళీ వైయస్ జగన్ రావాలి అని ప్రజల కోరిక. ప్రజలు మా మీద నమ్మకాన్ని చూపిస్తున్నప్పుడు ఎండలు మాకు ఒక లెక్కకాదని గీత అన్నారు.