రా.. తేల్చుకుందాం.. చంద్రబాబుకు పిన్నెళ్లి సవాల్‌

నా కాన్వాయ్‌పై దాడి చేయించడం పిరికి పంద చర్య

రైతుల ముసుగులో టీడీపీ గుండాలకు మద్యం తాపించి దాడి చేయించాడు

తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు

మగతనం ఉంటే తేల్చుకుందాం రా.. చంద్రబాబూ

రాజధాని రైతులపై మాకు సానుభూతి ఉంది

అన్యాయం చేయాలనే ఆలోచన సీఎంకు ఏ కోశాన లేదు

సంయమనం పాటించాం.. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా
 

దాడి అనంతరం మీడియాతో ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి

 

గుంటూరు: రైతుల ముసుగులో టీడీపీ గుండాలకు మద్యం తాపించి చంద్రబాబు తన కాన్వాయ్‌పై దాడి చేయించాడని ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మగతనం ఉంటే.. ఎక్కడకు రావాలో చెప్పు తేల్చుకుందామని ఓపెన్‌ చాలెంజ్‌ విసిరారు. దమ్ముంటే చంద్రబాబు ధైర్యంగా ముందుకు రావాలన్నారు. తన కారుపై, గన్‌మెన్‌పై దాడి చేసిన వారు ఎవరూ అమరావతి రైతులు కాదని, వాళ్లంతా టీడీపీ గుండాలేనని, రాజధాని ముసుగులో చంద్రబాబు అరాచకం సృష్టిస్తున్నారన్నారు. చంద్రబాబుకు చేతగాక రైతుల ముసుగులో దాడులు చేయిస్తున్నాడని, భూ కుంభకోణాలు బయటపడతాయనే దాడులు చేయిస్తున్నాడన్నారు. చాలా సంయమనం పాటించామని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి కూడా వివరించామమన్నారు.

కాన్వాయ్, గన్‌మెన్‌పై దాడి అనంతరం ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను విజయవాడకు వెళ్తుంటే హైవే మీద ధర్నా చేస్తున్నారు. నేను వెళ్తుంటే నా కారుకు కొంతమంది అల్లరి మూకలు అడ్డుతగిలి రాళ్లు వేసి కారును ధ్వంసం చేశారు. ఇదంతా గత పది రోజులుగా చూస్తుంటే రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య క్రియేట్‌ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజధాని ప్రాంతంలో రైతుల మీద సానుభూతి ఉంది. సమస్య ఉంటే వాళ్లు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి చర్చ చేస్తే న్యాయంగా ఉంటుంది. చంద్రబాబు ఆయన ట్రాప్‌లో పడేసి రైతుల ముసుగులో దాడి చేయడం దుర్మార్గం. చంద్రబాబుకు, ఆయన చెంచాలకు ఒకటే చెబుతున్నా, చాలెంజ్‌ చేస్తున్నా.. నా కారుపై రాళ్లు వేసి, నా గన్‌మెన్‌పై దాడి చేసిన వారు ఎవరూ అమరావతి రైతులు కాదు. బయట నుంచి వచ్చిన కొంతమంది గుండాలకు మద్యం తాగించి ఈ చర్యలు ఉసిగొల్పాడు. ఇలాంటి పరిస్థితి మంచిది కాదు.

మమ్మల్ని ఫేస్‌ చేయాలంటే నీకు, నీ కొడుకు, నీ ఎమ్మెల్యేలకు చాలెంజ్‌ చేస్తున్నా.. నువ్వు మోగోడివి అయితే నీకు చేతనైతే ఎక్కడకు రావాలో చెప్పు అక్కడకే వస్తాం. అంతేగానీ అమాయక రైతులను అడ్డంపెట్టుకొని రైతుల మసుగులో ఇలాంటి దాడులు చేయడం దుర్మార్గం. నా కారుపై రాళ్లు వేసినంత మాత్రాన వాళ్ల సమస్య తీరదు. చంద్రబాబు శాంతిభద్రతకు విఘాతం కలిగించి ఏదో జరిగిపోతుందని క్రియేట్‌ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక పథకం ప్రకారం చేస్తున్నాడు. రైతుల దగ్గరకు వెళ్లి భార్య చేతి గాజులు ఇప్పించి సానుభూతి పొందాలని ప్రయత్నం చేశాడు.

హెరిటేజ్‌ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లు దోచేసిన విధానం చూశాం. గతంలో మా నాయకుడిని చంద్రబాబు, కాంగ్రెస్‌ ఇద్దరూ కలిసి అక్రమంగా అరెస్టు చేసినప్పుడు వైయస్‌ఆర్‌ సీపీ సంయమనం పాటించింది. అంతేగానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యేలపై దాడి చేసి పబ్బం గడుపుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. కొంతమందికి మద్యం తాపించి దాడికి ప్రేరేపించావు. ఏదో చేయించాలనే కోరిక ఉంటే.. చాలెంజ్‌ చేస్తున్నా.. నువ్వు రా తేల్చుకుందాం. ఎక్కడికైనా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ మేము సంయమనంతో ఉన్నాం. రాజధాని రైతులపై మాకు సానుభూతి ఉంది. రాజధాని జేఏసీ సభ్యులు సీఎంతో చర్చలు జరపండి.

3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి గ్రామంలో ప్రతి వర్గాన్ని, ప్రాంతాల ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అన్యాయం చేయాలనే ఆలోచన సీఎం వైయస్‌ జగన్‌కు ఏ కోశాన లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలుగా చెబుతున్నాం.. మా నాయకుడు ఎంత ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారో అదే తోవలో మేము నడుస్తున్నాం. ఇలాంటి తాటాపు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. పల్నాడు ప్రాంతంలో లోకేష్‌ బినామీ యరపతినేని శ్రీనివాస్‌ను అడ్డంపెట్టుకొని నన్ను భయపెట్టాలని చూశాడు. ఆ రోజే ఉడత ఊపులకు భయపడలేదు. నిజంగా నువ్వు మగాడివి అయితే.. నీ కొడుక్కు మగతనం ఉంటే ఓపెన్‌గా చాలెంజ్‌ చేస్తున్నాను.. రాజధాని రైతులను అడ్డం పెట్టుకొని కొంతమందికి తాపించే దాడి చేయించడం సమంజసం కాదు. గన్‌మెన్‌పై కూడా దాడి చేశారు. ఈ విషయంపై వెంటనే ఎస్పీతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే బయట నుంచి వచ్చారో.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరాను. ఫిర్యాదు కూడా చేయనున్నా’మని విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

Back to Top