రాష్ట్ర‌వ్యాప్తంగా పింఛ‌న్ల పండగ‌

61.65 ల‌క్ష‌ల మందికి వాలంటీర్ల ద్వారా పింఛ‌న్ సొమ్ము

వాలంటీర్ల ద్వారానే సైనిక సంక్షేమ పెన్ష‌న్ల పంపిణీ

అమ‌రావ‌తి:  రాష్ట్ర వ్యాప్తంగా  పెన్షన్ల పంపిణీ శ‌ర‌వేగంగా సాగుతోంది.  వాలంటీర్ల ద్వారా ఉద‌యం నుంచే పెన్ష‌న్లు పంపిణీ మొద‌లైంది.  ‌వైయ‌స్సార్‌ పెన్షన్‌ కానుకను అక్టోబ‌ర్‌ 1న రాష్ట్ర వ్యాప్తంగా 61.65 లక్షల మంది లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా నేరుగా అందిస్తున్నారు. ఇందుకుగానూ, రూ. 1,497.88 కోట్లను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ నెలలో కొత్తగా 34,907 మందికి పెన్షన్‌ మంజూరు చేశారు. కొత్త పెన్షన్‌దారుల కోసం రూ. 8.52 కోట్లు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.52 లక్షల మంది వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల చేతులకే పెన్షన్లు అందిస్తున్నారు. 

ఈ నెల నుంచి సైనిక సంక్షేమ పెన్షన్లు కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు.  847 సైనిక సంక్షేమ పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.42.35 లక్షలు విడుదల చేసింది. పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌బిఐఎస్ విధానం అమ‌లు చేస్తున్నారు. ఠంచ‌న్‌గా పింఛ‌న్ సొమ్ము అంద‌డంతో ల‌బ్ధిదారులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top