హైదరాబాద్: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబును వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.