తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. “నా ధైర్యం మీరే… నా బలం మీరే… నాన్నగారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు. కష్టకాలంలో కూడా వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడి భుజాలపై మోస్తున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని నాపై విశ్వాసం ఉంచిన మీరే మన పార్టీకి అసలైన బలం” అని వైయస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదని, లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని స్థాయిల కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు.