తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై లోక్ సభలో వైయస్ఆర్ సీపీ ఎంపీలు ఆందోళన

న్యూఢిల్లీ:   లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, కృష్ణా జలాల అంశం, పోలవరం నిధులపై చర్చకు పట్టుబట్టి, వెల్ లోకి దూసుకెళ్ళి  వైయస్ఆర్ సీపీ  ఎంపీలు నిరసన తెలిపారు.  శ్రీశైలంలో 800 అడుగల మట్టంలోనే నీటిని తోడేస్తూ..  తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ప్రస్తావించిన వైయస్ఆర్ కడప ఎంపీ  వైయస్ అవినాష్ రెడ్డి
 విభజన చట్టం, నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది, తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాల‌నిఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్.

ఏపీ వాదన సరైనదే:
నీటి విష‌యంలో ఏపీ వాద‌న స‌రైందేన‌ని మంత్రి గ‌జేంద్ర‌సింగ్ ష‌షేకావ‌త్ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకే గెజిట్ విడుదల చేశామ‌ని జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ వివ‌ర‌ణ ఇచ్చారు.

Back to Top